Rain Alert: ఏపీ, తెలంగాణపై తీవ్ర అల్పపీడన ప్రభావం అధికంగా ఉంది. వాయవ్యం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోంది.
ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతోంది. ఇటు రుతు పవన ద్రోణి సముద్ర మట్టం వద్ద జైసల్మేర్ నుంచి వాయవ్య, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంత తీరం, ఆగ్నేయి దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు కొననసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ అనేక చోట్ల, రేపు చాలా చోట్ల, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే పరిస్థితి ఉంది. రాగల రెండు రోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. వీటితోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి.
మరోవైపు ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్ర తీరం వెంట తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది. తీరం వెంట పెనుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రేపటిలోపు తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇటు రాయలసీమలోనూ చిరు జల్లులు కురుస్తున్నాయి.
(i) Well Marked Low Pressure Area lies over Northwest & adjoining Westcentral Bay of Bengal off Odisha and adjoining north Andhra Pradesh coasts. pic.twitter.com/m6fcG8jKw9
— India Meteorological Department (@Indiametdept) August 8, 2022
Well-marked low pressure area lies over northwest Bay, adjoining areas of coastal Odisha, north coastal Andhra Pradesh & westcentral Bay at 0830 hrs IST of today, 8th Aug, 2022. To intensify into a depression during next 24 hrs and move across Odisha & Chattisgarh. pic.twitter.com/aPXiQ7Li5I
— India Meteorological Department (@Indiametdept) August 8, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook