Rajasthan political crisis: కాంగ్రెస్ పార్టీని వీడే నాయకులను ఉద్దేశించి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వాళ్లను వెళ్లనివ్వండని పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) బుధవారం కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన ఎన్ఎస్యూఐ సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ''కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్లాలనుకుంటారో.. వారిని వెళ్లనివ్వండి.. భయపడాల్సిన అవసరం లేదు. మీలాంటి వారికి అవకాశం లభిస్తుంది'' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తిరుబాటు నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను ( Sachin Pilot ) ఉద్దేశించే రాహుల్ గాంధీ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
Also read: Rajasthan: బీజేపీకు నో చెప్పిన సచిన్ పైలట్
ఇదిలాఉంటే.. ఈ వార్తలను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్చార్జ్ రుచి గుప్తా ( NSUI leader Ruchi Gupta ) ఖండించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో విద్యార్థులు, యువత గురించి మాత్రమే చర్చ జరిగిందని, ఈ వార్తలన్నీ నిరాధారమైనవేనని వెల్లడించారు.
Also read: COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం
రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత విబేధాలతో మూడు, నాలుగు రోజుల నుంచి పలు ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో అశోక్ గెహ్లాట్ ( CM Ahsok Gelhot ) ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చివరకు ఈ సమస్యలను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవుల నుంచి పక్కకు పెట్టేసింది. ( Also read: Jio Glass price: జియో గ్లాస్ ధర ఎంత ? జియో గ్లాస్ ఫీచర్స్ ఏంటి ? )