Rahul Gandhi - rae bareli: రాయబరేలిలో రాహుల్ గాంధీ విక్టరీ కష్టమేనా.. ? సెఫాలిజిస్టులు మాట ఇదే..?

Rahul Gandhi - rae bareli: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తూ వస్తోన్న రాయబరేలి నుంచి ఈ సారి గెలవడం కష్టమేనా..? మరోసారి యూపీ ప్రజలు రాహుల్ గాంధీని ఓడించబోతున్నారా ? సెఫాలిజిస్టులు చెబుతున్నా మాట ఏమిటంటే.. ?

Written by - TA Kiran Kumar | Last Updated : May 22, 2024, 07:30 AM IST
Rahul Gandhi - rae bareli: రాయబరేలిలో రాహుల్ గాంధీ విక్టరీ కష్టమేనా.. ? సెఫాలిజిస్టులు మాట ఇదే..?

Rahul Gandhi - rae bareli: 18వ లోక్‌సభ జరుగుతున్న ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషనల్ 7 విడతల్లో నిర్వహిస్తోంది. ఇప్పటికే కీలకమైన ఐదు దశలు పూర్తయ్యాయి. మిగిలిన రెండు దశల పోలింగ్‌తో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి కూడా రెండు చోట్ల నుంచి ఎంపీగా పోటీ చేయడం విశేషం. రెండో విడత ఎన్నికల్లో భాగంగా కేరళలోని వాయనాడ్ నుంచి రెండోసారి లోక్ సభకు పోటీ చేసారు. అక్కడ గెలుపు పై నమ్మకం లేకనే ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని కీలకమైన రాయబరేలి నుంచి బరిలో దిగినట్టు ఆయన ప్రత్యర్ధి పార్టీ ఈయిన బీజేపీ ఆరోపణలు చేసింది. అవేమి పట్టించకోకుండా రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా వస్తున్న రాయబరేలి నుంచి ఎంపీగా పోటీ చేసారు. బీజేపీ ముందు నుంచి చెబుతున్నట్టుగా రెండో విడత ఎన్నికలు పూర్తైయిన తర్వాత ముందస్తుగా అక్కడ నుంచి పోటీ చేస్తోన్నట్టు చెప్పకుండా రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసారు. తన నియోజకవర్గం అమేథీ నుంచి కాకుండా రాయబరేలి నుంచి పోటీ చేయడం వెనక ఆయన అక్కడ ఓడిపోతారనే బలమైన నమ్మకంతో ఈ సీటు నుంచి పోటీ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.  

5వ దశలో అందరి దృష్టి రాయబరేలి నియోజకవర్గంపై కేంద్రీకృతం కావడం వెనక రాహుల్ గాంధీ నుంచి పోటీ చేయడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఈ నియోజకవర్గం అయోధ్య నుంచి దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య ఇంపాక్ట్ ఈ నియోజకవర్గంపై ఉంది. ఇక రాహుల్ గాంధీ కూడా ఈ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లినపుడు అక్కడ క్యూలో నిలుచున్న ఓటర్లు ఆయన్ని జై శ్రీరామ్ నివాదాలతో హోరెత్తించారు. కానీ రాహుల్ గాంధీ అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు.

Also Read: New Liquor Brands: ఏపీ మద్యం బ్రాండ్లు తెలంగాణలో వస్తున్నాయా.. మంత్రి క్లారిటీ ఇదే!

అయితే అక్కడ రాహుల్ గాంధీపై బీజేపీ తరుపున స్థానికుడైన దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు. ఎవరైనా బలమైన ప్రత్యర్ధిని నిలిబడితే మాత్రం రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఉండేదనే వాదన పలువురు విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఈయన గతంలో రెండు సార్లు సోనియా గాంధీపై  ఇదే నియోజవర్గం నుంచి పోటీ చేసిన చరిత్ర వుంది. ఒక వేళ రాహుల్ గాంధీ రాయబరేలితో పాటు వాయనాడ్ నుంచి రెండు చోట్ల గెలిస్తే ఏ లోక్ సభను త్యాగం చేస్తారనేది కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. వాయనాడ్‌ను ఉంచుకొని రాయబరేలికి రాజీనామా చేస్తారా ? రాయబరేలి సీటు ఉంచుకొని వాయనాడ్‌ను ఒదిలేస్తారా అనేది కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.

గత 2014లో ఇక్కడ సోనియా గాంధీ రాయబరేలి నుంచి  3 లక్షల మెజారిటీతో గెలిచారు. 2019లో ఆ తర్వాత మెజారిటీ 1.5 లక్షకు దిగివచ్చింది. ఈ సారి ఎన్నికల్లో రాహుల గాంధీ ఎంత మెజారిటీతో గెలుస్తారనేది కూడా హాట్ టాపిక్ అని చెప్పాలి. అసలు గెలుస్తారా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ ఓడిపోతే.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆశలు ఒదులుకున్నట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాహుల్ గాంధీ ఫస్ట్ టైమ్ బరిలో దిగిన  రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గం విషయానికొస్తే.. ఈ సీటు రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ పోటీ చేసారు. ఆ తర్వాత నానమ్మ ఇందిరా గాంధీ వాళ్లిద్దరి తర్వాత ఆయన తల్లి సోనియా గాంధీ ఎంపీలుగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచి చట్ట సభల్లో ప్రవేశించారు. ఇక 1996, 99 ఎన్నికల్లో మాత్రం ఈ సీటు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లింది. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ రాయబరేలి నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయబరేలి నుంచి బరిలో నిలిచారు. 

Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్‌ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్‌' బాంబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News