Punjab Issue: రాహుల్, ప్రియాంకాలపై ఆరోపణలు చేసిన కెప్టెన్ అమరిందర్ సింగ్

Punjab Issue: పంజాబ్ కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. పదవీచ్యుతుడైన కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్, ప్రియాంకలపై ఆరోపణలు చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2021, 08:11 AM IST
  • రాహుల్, ప్రియాంకా గాంధీలపై ఆరోపణలు చేసిన కెప్టెన్ అమరిందర్ సింగ్
  • అవమానకరంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు
  • రాహుల్, ప్రియాంకలకు రాజకీయ అనుభవం లేదు
Punjab Issue: రాహుల్, ప్రియాంకాలపై ఆరోపణలు చేసిన కెప్టెన్ అమరిందర్ సింగ్

Punjab Issue: పంజాబ్ కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. పదవీచ్యుతుడైన కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్, ప్రియాంకలపై ఆరోపణలు చేశారు.

పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం నాయకత్వమార్పుకు దారి తీసింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్(Amarinder Singh)పదవీచ్యుతుడయ్యారు. అమరిందర్ సింగ్ పోటీ వర్గమైన నవజ్యోత్ సింగ్ సిద్దూ పైచేయి సాధించారు. పంజాబ్ పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. పదవి నుంచి దిగిపోయిన కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా..రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఆరోపణలు చేశారు. వివిధ వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. 

కాంగ్రెస్ పార్టీ నేతలైన రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi)లకు రాజకీయ అనుభవం ఏమాత్రం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. రాహుల్, ప్రియాంకలు తన పిల్లల్లాంటివారని చెబుతూనే..అవమానకరంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని చెప్పారు. ఎమ్మెల్యేల్ని విమానాల్లో గోవాకు తీసుకెళ్లడం తన విధానం కాదన్నారు. అనుభవం లేని రాహుల్, ప్రియాంకలను కొంతమంది సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని విమర్శించారు. పంజాబ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూపై(Navajyoth Singh Sidhu)బలమైన అభ్యర్ధిని పోటీకి దించుతానని హెచ్చరించారు. సిద్ధూ జాతి వ్యతిరేక శక్తి, ప్రమాదకర వ్యక్తి అని అమరిందర్ సింగ్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం సిద్ధూకు దక్కకుండా చేయడమే తన ధ్యేయమన్నారు. సిద్ధూ వంటి ప్రమాదకర వ్యక్తుల్నించి దేశాన్ని కాపాడేందుకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం అనంతరం మరొకరిని ముఖ్యమంత్రి చేయాలని తానే కోరానని..కానీ సోనియా గాంధీ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్ రాజకీయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు.

Also read: Corona Death Compensation: ప్రతి కరోనా మరణానికి రూ.50 వేల పరిహారం ఇవ్వనున్న కేంద్రం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News