Punjab Election 2022: సోనూ సూద్​ను అడ్డుకున్న ఎన్నికల సంఘం అధికారులు- కారు సీజ్​!

Punjab Election 2022: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో.. పోలింగ్ బూత్​ల వద్దకు వెళ్లకుండా సోనూ సూద్​కు ఎన్నికల కమిషన్​ ఆదేశాలు జారీ చేసింది. కారు స్వాధీనం చేసుకుని ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 02:59 PM IST
  • సోనూ సూద్​కు పోలింగ్ బూత్​ల వద్దకు వెళ్లనివ్వని ఈసీ
  • ఓటర్లను ప్రభావితం చేయొచ్చన్న ఆరోపణలో కారణం
  • కారు స్వాధీనం.. ఇంట్లోనే ఉండాలని స్పష్టం
Punjab Election 2022: సోనూ సూద్​ను అడ్డుకున్న ఎన్నికల సంఘం అధికారులు- కారు సీజ్​!

Punjab Election 2022: ప్రముఖ నటుడు సోనూ సూద్​ను పంజాబ్​లోని మొగాలో పోలింగ్ బూత్​ల సందర్శించకుండా అడ్డుకున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనూ సూద్ సోదరి ఎన్నికల బరిలో ఉన్నారు. దీనితో ఆయన ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ఎన్నికల సంఘం ఆరోపించింది.

శోరోమణి అకాళీదల్ చేసిన ఫిర్యాదు మేరకు.. ఎన్నికల సంఘం అధికారులు పోలీగ్​ బూత్​ల దగ్గరకు వెళ్లకుండా సోనూ సూద్​ కార్​ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పోలీంగ్ స్టేషన్ల వద్దకు వెళ్లేందుకు సోనూ సూద్​ ప్రయత్నించిన నేపథ్యంలో ఆయన కారును సీజ్​ చేసీ.. ఎన్నికల సంఘం అధికారులు ఆయన్ను ఇంటికి పంపించినట్లు తెలిసింది. ఆయన పోలింగ్ అయిపోయే వరకు ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని స్పష్టం చేసినట్లు వెల్లడైంది. ఒక వేళ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కూడా సోనూ సూద్​కు ఎన్నికల సంఘం తెలిపినట్లు.. మొగా పీఆర్​ఓ అధికారికంగా ప్రకటించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ స్పందించారు. ఇతర పార్టీల నేతలు ఓటర్లను కొంటున్నారని ఆరోపించారు. వెంటనే ఎన్నికల సంఘం వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పంజాబ్​ ఎన్నికల అప్​డేట్స్​..

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలకు నేడే పోలింగ్​ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుది. ఆరు తర్వాత కూడా క్యూలో నిలుచున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు అధికారులు.
పంజాబ్​లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

ఈ సారి ఎన్నికలక్లో.. కాంగ్రెస్​కు ప్రధాన పోటీదారుగా ఆమ్​ ఆద్మీ పార్టీ ఉంది. గెలుపుపై రెండు పార్టీలు దీమాగా ఉన్నాయి. ఇక బీజేపీ, శోరోమణి అకాలీదల్ కూటమి.. ఈసారైనా తమ పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. మార్చి 10 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Also read: Rajasthan: కాస్సేపట్లో పెళ్లి..పెళ్లి కొడుకు సహా కుటుంబమంతా మృతి, ఏం జరిగింది

Also read: UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో నేడు మూడో విడత పోలింగ్.. 16 జిల్లాల్లోని 59 స్థానాలకు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News