Punjab Assembly Election: రెండు చోట్ల నుంచి బరిలో దిగనున్న పంజాబ్ సీఎం చన్నీ

Punjab CM Charanjit Singh to contest from two seats: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 07:13 PM IST
  • పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చన్నీ రెండు చోట్ల పోటీ
  • ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • బదౌర్, చామకూర్ సాహిబ్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న చన్నీ
 Punjab Assembly Election: రెండు చోట్ల నుంచి బరిలో దిగనున్న పంజాబ్ సీఎం చన్నీ

Punjab CM Charanjit Singh to contest from two seats: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేయనున్నారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు బదౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చన్నీ బరిలో దిగనున్నారు. ఆదివారం (జనవరి 30) విడుదల చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 8 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను ప్రకటించింది.

చరణ్‌జిత్ సింగ్ చన్నీని రెండు చోట్ల నుంచి బరిలో దింపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తాను ఈ విషయాన్ని ముందే చెప్పానన్నారు. 'మా సర్వే ప్రకారం సీఎం చరణ్‌జిత్ చామకూర్ సాహిబ్‌లో ఓటమి చెందబోతున్నాడు. అందుకే కాంగ్రెస్ ఆయన్ను రెండు చోట్ల పోటీకి దింపుతోంది. దీన్నిబట్టి మా సర్వే నిజమైనట్లే కదా..!' అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు గతేడాది అమరీందర్ సింగ్ సీఎం పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సీఎం అయిన సంగతి తెలిసిందే. కేవలం ఎన్నికల వరకే చరణ్‌జిత్‌ను సీఎంగా కొనసాగిస్తారని... ఆ తర్వాత పక్కనపెడుతారని ఆ సమయంలో ప్రతిపక్షాలు విమర్శించాయి. 

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఇప్పటికైతే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని రాహుల్ గాంధీ ఇటీవలే వెల్లడించారు. అయితే సీఎం రేసులో చరణ్‌జిత్ చన్నీకి, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి (Navjot Singh Sidhu) మధ్య గట్టి పోటీ నెలకొనడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి.

Also Read: Budget 2022 Expectations: బడ్జెట్ 2022 ఆ నిర్ణయం ఉంటే.. పెరగనున్న టెక్​ హోం శాలరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News