Charanjit Singh Channi: పంజాబ్ లో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ...అక్రమ మైనింగ్ కేసులో సీఎం చన్నీ మేనల్లుడు అరెస్ట్..

Punjab CM Channi’s nephew:  పంజాబ్ లో కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని పోలీసులు అరెస్ట్ చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 11:38 AM IST
  • పంజాబ్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్‌
  • సీఎం చన్నీ మేనల్లుడు అరెస్ట్
Charanjit Singh Channi: పంజాబ్ లో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ...అక్రమ మైనింగ్ కేసులో సీఎం చన్నీ  మేనల్లుడు అరెస్ట్..

ED arrests Punjab CM Channi’s nephew: పంజాబ్  అసెంబ్లీ ఎన్నికలకు  ముందు కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని.. మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అర్థరాత్రి అరెస్టు చేసింది. 

వివరాల్లోకి వెళితే...

చన్నీ మేనల్లుడు అయిన భూపిందర్‌ సింగ్‌ హనీ (Bhupendra Singh Honey).. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో...అతడిపై ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు (money laundering case) నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు చెందిన పలు ఇళ్లపై గత నెల 18న దాడులు జరిపింది ఈడీ  (ED). ఈసోదాల్లో దాదాపు రూ.10 కోట్ల మేర అక్రమ నగదు, ఇతర పత్రాలు, నగలు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ క్రమంలో విచారణ అనంతరం భూపిందర్‌ సింగ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఎన్నికల (Punjab Assembly Elections 2022) ముందు సీఎం చరణ్‌జిత్ చన్నీ మేనల్లుడిని ఈడీ అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 20న జరగనుండగా...మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

Also Read: Former IPS Officer: మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో 2వేల రూపాయల నోట్ల కట్టలు.. ఎక్కడ దాచాడో తెలిస్తే షాకే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News