ISRO: ఆంధ్రప్రదేశ్ శ్రీరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ 50 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్య లో ప్రవేశపెట్టింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ( ISRO ) మరో ఘనత సాధించింది. ఏపీ శ్రీహరికోట ( Sriharikota )లోని షార్ సెంటర్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా పీఎస్ఎల్వి శ్రేణిలో సీ 50 రాకెట్ ప్రయోగించింది. 1410 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01 ( CMS-01 )ను ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతమవడంతో మరింత మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభిస్తాయి. దీని పరిధి భారత్‌తో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లకు వర్తించనుంది.
మద్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ప్రయోగించారు. జీ శ్యాట్ 12 స్థానాన్ని ఇవాళ ప్రయోగించిన సీఎంఎస్ -01 భర్తీ చేయనుంది. సీఎంఎస్ -01 దేశానికి చెందిన 42వ సమాచార ఉపగ్రహం. పీఎస్ఎల్వి సీ 50 ( PSLV C 50 ) తొలి దశ విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ 50 ఎక్స్ఎల్ ఆకృతిలో ఇది 22వది. షార్ నుంచి ఓవరాల్‌గా చూసుకుంటే 77వ మిషన్.
పీఎస్ఎల్వీ సీ 50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ కే శివన్ హర్షం వ్యక్తం చేశారు. నాలుగురోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామన్నారు. Also read: Farmers protest: రైతులకు ఆ హక్కు లేదు..సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు