లక్నో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ సీఏఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనలతో పలువురు ఆందోళనకు దిగిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా లక్నోలో ఆదివారం జాతీయ జండా ఎగరేసేచోట గుమిగూడిన జనం.. జండా వందనం అనంతరం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు. శనివారం ఇదే క్లాక్ టవర్ వద్ద సీఏఏకు వ్యతిరేక ఆందోళనలకు దిగిన పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన వారిలో ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఆందోళనలకు సూత్రధారిగా భావిస్తున్న ఫైజన్ లహీతో పాటు సమాజ్ వాదీ పార్టీకి చెందిన విద్యార్థి సంఘాల నేత కూడా ఉన్నట్టు అదనపు డీసీపీ వికాస్ చంద్ర త్రిపాఠి తెలిపారు.
శనివారం జరిగిన ఆందోళనల నేపథ్యంలో అరెస్టులను నిరసిస్తూ ఆదివారం జాతీయ జండాను ఎగరేసిన అనంతరం నిరసనకారులు మరోసారి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ సీఏఏ వ్యతిరేక నిరసనలు