Prostitution Racket: గోవాలో వ్యభిచార దందా బట్టబయలు.. టీవీ నటి సహా ముగ్గురికి విముక్తి...

Prostitution Racket Busted in Goa : హఫీజ్‌ను ట్రాప్ చేసి అతనితో రూ.50 వేలకు డీల్ కుదుర్చుకున్నారు. ఆపై హోటల్ వద్దకు వెళ్లగానే దాడులు నిర్వహించి హఫీజ్‌ను అరెస్ట్ చేశారు. 30-37 ఏళ్ల వయసున్న ముగ్గురు మహిళలకు వ్యభిచారం నుంచి విముక్తి కల్పించారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 07:16 PM IST
  • గోవాలో వ్యభిచార దందా బట్టబయలు
  • నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ముగ్గురు మహిళలకు విముక్తి
Prostitution Racket: గోవాలో వ్యభిచార దందా బట్టబయలు.. టీవీ నటి సహా ముగ్గురికి విముక్తి...

Prostitution Racket Busted in Goa : గోవాలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు. వ్యభిచార గృహంపై దాడులు చేసి హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓ టీవీ నటి సహా ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించారు.

సైబర్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పనాజీ సమీపంలోని సంగోల్ద గ్రామంలో ఉన్న ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. హైదరాబాద్‌కి చెందిన హఫీజ్ సయిద్ బిలాల్ అనే వ్యక్తి ఆ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు వారికి తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హఫీజ్ సయిద్‌తో కాంటాక్ట్‌లోకి వెళ్లారు.

హఫీజ్‌ను ట్రాప్ చేసి అతనితో రూ.50 వేలకు డీల్ కుదుర్చుకున్నారు. ఆపై హోటల్ వద్దకు వెళ్లగానే దాడులు నిర్వహించి హఫీజ్‌ను అరెస్ట్ చేశారు. 30-37 ఏళ్ల వయసున్న ముగ్గురు మహిళలకు వ్యభిచారం నుంచి విముక్తి కల్పించారు. ఇందులో ఇద్దరు మహిళలు ముంబైలోని విరార్‌కి చెందినవారు కాగా.. మరొకరు హైదరాబాద్‌కి చెందినవారిగా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఢిల్లీలో వెలుగుచూసిన మరో ఘటనలో స్థానిక పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ఓ మైనర్ బాలికకు విముక్తి కల్పించారు. ఆ బాలికను కొంతమంది కిడ్నాప్ చేసి వ్యభిచార నిర్వాహకులకు విక్రయించినట్లుగా గుర్తించారు. వ్యభిచార నిర్వాహకులు ఆమెను పలు ప్రాంతాలకు పంపించి వ్యభిచారం చేయించినట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో శుక్రవారం (మార్చి 18) వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Chinna Jeeyar: సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై  చినజీయర్ వివరణ...

Also Read: Harbhajan Singh: హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News