Prashant Kishor Strategy: ప్రశాంత్ కిషోర్‌కు కొత్త పార్టీ కలిసి వస్తుందా..?

Prashant Kishor Strategy: కొత్త పార్టీతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అవుతారా..? ఆయన ఎలాంటి విధానాలతో రాబోతున్నారు..? బీహార్‌ నుంచి ప్రయాణం కలిసి వస్తుందా..? పీకే వెంట నడిచేది ఎవరు..? ప్రజలు విశ్వసిస్తారా..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు.? 

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 01:14 PM IST
  • కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటన
  • పీకే పార్టీపై రాజకీయ వర్గాల్లో చర్చ
  • త్వరలో కొత్త పార్టీపై క్లారిటీ
Prashant Kishor Strategy: ప్రశాంత్ కిషోర్‌కు కొత్త పార్టీ కలిసి వస్తుందా..?

Prashant Kishor Strategy: కొత్త పార్టీతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అవుతారా..? ఆయన ఎలాంటి విధానాలతో రాబోతున్నారు..? బీహార్‌ నుంచి ప్రయాణం కలిసి వస్తుందా..? పీకే వెంట నడిచేది ఎవరు..? ప్రజలు విశ్వసిస్తారా..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు.? 

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. ఈవిషయాన్ని  సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. పదేళ్ల రోలర్ కోస్టర్ ప్రయాణం తర్వాత ..అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ప్రజల తరపున విధివిధానాలు రూపొందించినట్లు ట్వీట్ చేశారు. ఇక నుంచి జన్‌ సురాజ్‌ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. 

దీంతో పీకే ట్వీట్‌తో పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు ఖరారైంది. బీహార్‌ నుంచి తన రాజకీయ జీవితం ఉంటుందన్నారు. గతకొంతకాలంగా ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సైతం కలిశారు.  పీకేకు కీలక పదవి ఇస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఐతే తాను ఏ పార్టీలో చేరడం లేదని..సలహాదారుడిగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న ప్రచారానికి తెరపడింది. 

ప్రశాంత్‌ కిషోర్ కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతోంది.  బీహార్‌లో గెలుపే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్తగా దేశ పరిస్థితులు పీకే తెలుసని ..అది ఆయనకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐతే ప్రశాంత్ కిషోర్ వెంట వెళ్లే నాయకులు ఎవరన్న దానిపై క్లారిటీ లేదు.  త్వరలో దీనిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. 

తన ముఖ్య అనుచరులు, వెంట వచ్చే నేతలతో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భారీ సభ ద్వారా పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే సభ ద్వారా పార్టీ విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. అధికార పార్టీ ప్రజా వ్యతిరేకత ఓట్లను చీల్చడానికి బీహార్‌లో పార్టీ పెడుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. జేడీయూలోకి వెళ్లినా అక్కడ రాణించలేకపోయారు. కాంగ్రెస్‌(CONGRESS)లో చక్రం తిప్పుతారని గుసగుసలు వినిపించాయి. మరి  కొత్త పార్టీ ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి..

Also read:Rahul Night Club Video: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో లీక్... నేపాల్‌లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత..?

Also read:Ram Gopal Varma Tweets On KA Paul: కేఏ పాల్‌ పై ఆర్జీవీ ట్వీట్ల వర్షం..వరుసగా 10కి పైగా ట్వీట్లు చేసిన వర్మ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News