Priyanka Gandhi Vadra: ప్రియాంక వాద్రా ఖాతాలో ఆ రికార్డు చేరబోతుందా..! సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..

Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ అగ్ర నేత  ప్రియాంక గాంధీ ఖాతాలో  రికార్డు చేరబోతుందా..! గాంధీ కుటుంబం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఆ రికార్డు సాధించబోతున్న తొలి మహిళా నేతగా రికార్డు క్రియేట్ చేయబోతుందా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 19, 2024, 07:15 AM IST
Priyanka Gandhi Vadra: ప్రియాంక వాద్రా ఖాతాలో ఆ రికార్డు చేరబోతుందా..! సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీకి అనధికార అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ లో తమ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తూ వస్తోన్న  రాయబరేలి నుంచి పోటీ చేసారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల విజయం సాధించారు. అయితే.. రెండు చోట్ల విజయం సాధించిన రాహుల్ గాంధీ ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎన్నికల ఫలితాలు వెలుబడిన రెండు వారాల్లోగా ఒదులుకోవాలి. తాజాగా రాహుల్ గాంధీ తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన కేరళ ఒకవైపు.. మరోవైపు దేశంలో అతి ఎక్కువ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ మరోవైపు ఉంది. దీంతో రాహుల్ గాంధీ.. ఢిల్లీలో అధికారం సాధించడానికి ఉపయోగపడే ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి స్థానాన్ని ఉంచుకొని వాయనాడ్ కు రాజీనామా చేసారు.

అయితే ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్ చేసారు. కేరళ రాష్ట్ర ప్రజల తరుపున ప్రియాంక పార్లమెంటు మెంబర్ గా తొలిసారి అడుగుగపెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇకపై పార్లమెంటులో  అన్నాచెల్లెలైన ఇద్దరు గాంధీలు పోరాడానికి రెడీ అయ్యారని సచిన్ పైలెట్ పేర్కొన్నారు. ప్రియాంక అక్కడ పోటీ చేస్తుండంపై అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్ారు. అంతేకాదు రాహుల్ గాంధీ ప్లేస్ ను ఆమె రీప్లేస్ చేయగలరని భావిస్తున్నారు.

మరోవైపు ప్రియాంక వాద్రా వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలవడం నల్లేరు మీద నడకే అంటున్నారు  రాజకీయ పార్టీ విశ్లేషకులు. ఒకవేళ ప్రియాంక వాద్రా గెలిచి పార్లమెంటులో అడుగుపెడితే.. ఒకే లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన అన్నా చెల్లెల్లుగా రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

ఇక కేరళలోని 20 లోక్ సభ స్థానాల్లో అందరు పురుషులే గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేసి గెలిస్తే కేరళ నుంచి తొలి మహిళ ఎంపీగా రికార్డు  క్రియేట్ చేయడం ఖాయం అని చెబుతున్నారు. అంతేకాదు అక్కడ ప్రియాంక వాద్రా.. రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం ఖాయం అంటున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ప్రియాంక గాంధీ.. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాయనాడ్ నుంచి తొలిసారి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల గోదాలో దిగుతున్నారు. మరి ఈ పోటీలో ప్రియాంక వాద్రా గెలవడం గ్యారంటీ అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ ఎన్నికల్లో ప్రియాంక.. ఖమ్మం నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ ఇపుడు అన్న గెలిచిన వాయనాడ్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగడం విశేషం.

Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News