పోస్టాఫీస్ ఉద్యోగుల యూనిఫాం మారుతుందోచ్..!!

దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ లలో పనిచేసే పోస్టుమెన్, ఉమెన్ లు ఇక నుంచి కొత్త డ్రెస్ లలో కనిపించనున్నారు.

Last Updated : Jan 31, 2018, 05:16 PM IST
పోస్టాఫీస్ ఉద్యోగుల యూనిఫాం మారుతుందోచ్..!!

దేశ వ్యాప్తంగా పోస్టాఫీస్ లలో పనిచేసే పోస్టుమెన్, ఉమెన్ లు ఇక నుంచి కొత్త డ్రెస్ లలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశంలోని 90 వేలమంది పోస్టుమెన్, ఉమెన్స్ ఖాదీ వస్త్రాలు ధరించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, మనోజ్ సిన్హా కలిసి..  పోస్టుమెన్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ లు ధరించే వస్త్రాలను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా కమ్యునికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ- " ప్రధాన మంత్రి ఖాదీని ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము ఖాదీ రంగులో ఉండే ఈ ఖాదీ యునిఫాంను నిర్ణయించాము. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ప్రక్రియను మేము నెలరోజుల క్రితమే ప్రారంభించాము" అన్నారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం(కేవీఐసీ)కు ఖాదీ వస్త్రాల కోసం రూ.48 కోట్ల ఆర్డర్స్ ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. పోస్టుమెన్స్‌కు రెండు జతల బట్టలు (రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్) పోస్టుఉమెన్స్‌కు రెండు జతల సల్వార్ – కమీజ్ అందజేయనున్నారు. ఈ కొత్త ఖాదీ డ్రెస్ లో జేబు మీద, టోపీ మీద 'ఇండియా పోస్ట్' లోగో ఉంటుంది.  

Trending News