ఆధార్ కార్డు పోస్టులో రాలేదా ? అయితే ఇలా డౌన్‌లోడ్ చేస్కోండి

ఆధార్ కార్డు పోస్టులో రాలేదా ? అయితే ఇలా డౌన్‌లోడ్ చేస్కోండి

Last Updated : Feb 24, 2019, 04:45 PM IST
ఆధార్ కార్డు పోస్టులో రాలేదా ? అయితే ఇలా డౌన్‌లోడ్ చేస్కోండి

మీరు దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు పోస్టులో ఇంకా మీకు చేరలేదా ? అయితే, కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆన్‌లైన్‌లో కూడా మీరు మీ ఆధార్ కార్డుని పొందవచ్చు. అవును, ఆధార్ కార్డును ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గల్లంతైన ఆధార్ కార్డు కోసం ఇక మీరు ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?
1) ఆన్‌లైన్‌లో eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2) అక్కడ ఆధార్ నమోదు సంఖ్య/ఆధార్ నెంబర్/విఐడి, పూర్తి పేరు, పిన్ కోడ్, సెక్యురిటీ కోడ్ వంటి వివరాలతో ఆన్‌లైన్ ఫారం భర్తీ చేయాలి.
3) ఇప్పుడు ఓటీపి (వన్ టైమ్ పాస్‌వర్డ్) రిక్వెస్ట్ చేసి మొబల్ నెంబర్ / ఈమెయిల్‌కి వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేయాలి.
4) అనంతరం భద్రతకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్ కూడా ఆధార్ లేఖతో సరిసమానమైన విలువ కలిగి వుంటుంది. త్వరితగతిన ఆధార్ సంఖ్యను పొందడం కోసం ఇది ఒక మార్గం కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని వేల కేంద్రాల్లో ఆధార్ సేవలు లభ్యమవుతున్నాయి. దీనికితోడుగా దేశవ్యాప్తంగా 13,000 పోస్ట్ ఆఫీస్ కార్యాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో వున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.

Trending News