సెప్టెంబర్1 నుంచి పోస్టు పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభం

సెప్టెంబర్‌ 1,2018న ఇండియా పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు (ఐపిపిబి) సేవలు ప్రారంభం కానున్నాయి.

Last Updated : Sep 1, 2018, 04:36 PM IST
సెప్టెంబర్1 నుంచి పోస్టు పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభం

సెప్టెంబర్‌ 1,2018న  ఇండియా పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు (ఐపిపిబి) సేవలు ప్రారంభం కానున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐపిపిబిను ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్ధిక లక్ష్యాలను మరింత వేగంగా చేరుకోవడానికి ఈ బ్యాంకు సేవలు సహాయపడతాయని కేంద్ర ప్రభుత్వం భావన. సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా తొలుత 650 శాఖల్లో, 3250 అనుబంధ కేంద్రాల్లో ఈ బ్యాంకు సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. డిసెంబర్ 31, 2018 నాటికి ఐపిపిబి వ్యవస్థ దేశంలోని 1.55 లక్షల పోస్టాఫీసులకు లింక్ చేయబడతాయి. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశంలోని అన్ని గ్రామాల్లో ఐపిపిబి సేవలు అందుబాటులోకి రానున్నాయని సంబంధిత అధికారి తెలిపారు.

ఐపిపిబి..  సేవింగ్, కరెంట్ అకౌంట్, నగదు బదిలీ, బిల్ పేమెంట్ మరియు వ్యాపార చెల్లింపులు వంటి సేవలను అందిస్తుంది. వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న డిజిటల్‌ సేవల తరహాలో పోస్టల్‌ బ్యాంకులో సేవలు పొందవచ్చు. ఈ సేవలు బ్యాంకు యొక్క స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్‌నుపయోగించి కౌంటర్ సేవలు, మైక్రో ATM, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఎస్ఎంఎస్ మరియు ఐవీఆర్ ద్వారా అందించబడతాయి.

ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు

ఇంటి వద్ద నుంచే పోస్టు మ్యాన్‌ వద్ద ఉన్న మైక్రో ఏటీఎం ద్వారా కొత్త ఖాతాలు ప్రారంభించవచ్చని తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌(సీపీఎంజీ) బ్రిగేడియర్‌ బి. చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 23 ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కేవలం 3 నిమిషాల్లో లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ సెల్‌ఫోన్‌కు వస్తుందన్నారు. సేవింగ్‌ ఖాతాలను రూ.100తో, కరెంట్‌ ఖాతాలను రూ.1000లతో ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. మిస్డ్‌ కాల్‌ చేస్తే చాలని, ఇంటి వద్దకే తమ పోస్టు మాన్‌ వచ్చి నగదు ఉపసంహరణ, డిపాజిట్‌ సేవలందిస్తారన్నారు. ఇంటి వద్ద అందించే సేవలకు కొంత ఫీజు వసూలు చేయనున్నారని చెప్పారు.

Trending News