PM Kisan Funds: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ.. ఈకేవైసీ గడువు పెంచిన కేంద్రం

PM Kisan Funds: అన్నదాతలకు గుడ్ న్యూస్. 11వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ( PM Kisan Samman Nidhi Yogana) నిధులు విడదలయ్యాయి. హిమాచల్ ప్రదేశలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో పీఎం సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేశారు.

Written by - Srisailam | Last Updated : May 31, 2022, 04:42 PM IST
  • రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ
  • లబ్దిదారులతో మాట్లాడిన పీఎం మోడీ
  • ఈ-కేవైసీ గడువు జూలై 31 వరకు పెంపు
PM Kisan Funds: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ.. ఈకేవైసీ గడువు పెంచిన కేంద్రం

PM Kisan Funds:  అన్నదాతలకు గుడ్ న్యూస్. 11వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ( PM Kisan Samman Nidhi Yogana) నిధులు విడదలయ్యాయి. హిమాచల్ ప్రదేశలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో పీఎం సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేశారు. తర్వాత 16 మంది లబ్దిదారులతో ప్రధాని మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి.. మీకు ఎలాంటి ఉపయోగం కల్గింది.. మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా... వంటి ప్రశ్నలను అడిగారు మోడీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఉజ్వల , వయ వందన యోజన, స్వచ్చ్ భారత్, స్వనిధి యోజన, వన్ నేషన్ వన్ రేషన్, గరీబ్ కల్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్, ముద్రా యోజన  పథకాల  లబ్ధిదారులతోనూ ప్రధాని నరేంద్ర మోడీ  మాట్లాడారు.

దేశంలోని 10 కోట్ల మంది అన్నదాతల ఖాతాల్లో 21 వేల కోట్ల రూపాయలు జమ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కిసాన్) పథంలో కింద  అన్నదాతకు పెట్టుబడి సాయం కింద ఏటా  6 వేల రూపాయలు ఇస్తుంది మోడీ సర్కార్.  ఏడాదిలో మూడు సార్లు.. 2 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 10 వాయిదాల్లో రైతులకు డబ్బులు విడుద‌ల చేశారు. 11వ విడత నిధులు  ఇప్పటికే ఇవ్వాల్సి ఉన్నా.. ఈ-కేవైసీ సమస్యలతో ఆలస్యమైంది. లబ్దిదారుల నుంచి మళ్లీ ఈకేవైవీ తీసుకున్నారు. లక్షలాది మంది ఫేక్ లబ్దిదారులను తొలగించారు.

ఈ-కేవైసీ గడువు జూలై 31 వరకు పెంపు

మరోవైపు పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. 11వ వాయిదా డ‌బ్బును పొందాలంటే ఈ-కేవైసీ త‌ప్ప‌నిస‌రి చేసుకోవాలని సూచించింది. ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా బ‌యోమెట్రిక్ ద్వారా సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అయితే సాంకేతిక సమస్యతో చాలామంది లబ్దిదారుల ఈ-కేవైసీ పూర్తి కాలేదు. దేశ వ్యాప్తంగా 11.22 కోట్ల మంది లబ్దిదారులు ఉండగా.. ఇప్పటివరకు 50 శాతం మంది మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు.  దీంతో పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ కోసం గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర సర్కార్.

మీ ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయో లేదో ఇలా చేక్ చేసుకోండి..

1.  పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్  https://pmkisan.gov.inలో లాగిన్ కావాలి
2. రైట్ సైడ్ ఉన్న బెనిఫిషియ‌రీ స్టేట‌స్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి
3.  ఆధార్ లేదా ఖాతా నెంబ‌రు ఎంట‌ర్ చేసి ‘గెట్ డేటా’  బటన్ నొక్కాలి
4.   స్క్రీన్‌పై స్టేట‌స్ క‌నిపిస్తుంది. ఈ-కేవైసీ పూర్తైతే  మీ అకౌంట్ లో నగదు జ‌మ‌వుతుంది
5.  బెనిఫిషియ‌రీ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోవ‌చ్చు

READ ALSO: Atmakur Bypoll: ఆత్మకూరు బైపోల్ కు టీడీపీ దూరం.. బీజేపీ కోసమేనా.. పొత్తుకు ముందస్తు వ్యూహమా?

READ ALSO: POWER PROJECT: సీఎం కేసీఆర్ నుంచి ప్రధాని మోడీ కమీషన్ తీసుకుంటున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News