ఆర్టికల్ 370ని అందుకే రద్దు చేశాం : ప్రధాని మోదీ

ఆర్టికల్ 370ని అందుకే రద్దు చేశాం : ప్రధాని మోదీ

Last Updated : Aug 9, 2019, 04:17 PM IST
ఆర్టికల్ 370ని అందుకే రద్దు చేశాం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఓ నూతన శకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్, లడఖ్ ప్రాంతవాసులు తీవ్రంగా నష్టపోయారని.. అయినప్పటికీ ఇంతకాలం వారికి జరిగిన అన్యాయంపై ఎక్కడా చర్చ జరగలేదని ప్రధాని మోదీ తెలిపారు. ఆర్టికల్ 370, 35ఏ వల్ల జమ్మూకాశ్మీర్ వాసులకన్నా ఉగ్రవాదులకు, అవినీతిపరులకే అధిక మేలు జరిగిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 ఉగ్రవాదులకు ఆయుధంలా మారిందని, దీని వెనుక పాక్ హస్తం ఉందని మోదీ ఆరోపించారు. తాము తీసుకున్న నిర్ణయంతో సర్ధార్ వల్లభభాయ్ పటేల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, వాజ్‌పేయి కల సాకారం చేశామని మోదీ అన్నారు. గురువారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్ 370 వల్ల జమ్మూకశ్మీర్‌కి మేలు జరుగుతుందనే విషయాన్ని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారని చెబుతూ తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం ఉందని మోదీ ధీమా వ్యక్తంచేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ కుట్రలను, ఉగ్రవాదులకు మీరే గట్టిగా బుద్ది చెప్పాలని జమ్మూకాశ్మీర్ వాసులకు ప్రధాని పిలుపునిచ్చారు.

Trending News