PM Narendra Modi discusses Kerala situation with CM P Vijayan, extends his condolence to grieving families: కేరళలో భారీ వర్షాలు బీభత్సం (Heavy rains) సృష్టిస్తున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 13 మంది కొట్టాయంకు చెందిన వారు ఉన్నారు. 8 మంది ఇడుక్కి జిల్లాకు చెందినవారు ఉన్నారు. ఇంకా కొందరు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
కేరళ విషాదంపై ప్రధాని మోదీ (PM Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. కేరళలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో (CM P Vijayan) చర్చించారు. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని తెలిపారు. వరదలు, కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని ఆదేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అన్నారు. క్షతగాత్రులు, బాధితుల సహాయార్థం అధికారులు పలు సహాహక చర్యలు చేపడుతున్నారని మోదీ (Modi) వెల్లడించారు. ప్రతిఒక్కరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Spoke to Kerala CM Shri @vijayanpinarayi and discussed the situation in the wake of heavy rains and landslides in Kerala. Authorities are working on the ground to assist the injured and affected. I pray for everyone’s safety and well-being.
— Narendra Modi (@narendramodi) October 17, 2021
Also Read : Megastar Chiranjeevi : ఆ ఘటనతోనే ఆక్సిజన్ బ్యాంకు ఆలోచన వచ్చింది - చిరంజీవి
అయితే కేరళలో (Kerala) భారీ వర్షాల (Heavy rains) ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకల కారణంగా వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శబరిమల దర్శనానికి ఎవరూ రావొద్దంటూ కేరళ ప్రభుత్వం (Kerala Government ) విజ్ఞప్తి చేసింది. ఇక సీఎం పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
It is saddening that some people have lost their lives due to heavy rains and landslides in Kerala. Condolences to the bereaved families.
— Narendra Modi (@narendramodi) October 17, 2021
Also Read : Watch: బౌండరీ లైన్ వద్ద మునివేళ్లతో అద్భుతమైన క్యాచ్...ఫిదా అవుతున్న నెటిజన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి