PM Narendra Modi visits bharat biotech company: హైదరాబాద్: ఫార్మ దిగ్గజం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అభినందించారు. భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్ (ICMR) తో కలిసి పని చేస్తోందని మోదీ పేర్కొన్నారు. కోవిడ్-19 ను అరికట్టకేందుకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు తనకు వివరించారని మోదీ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల ఆయన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందిస్తూ మోదీ సందర్శన అనంతరం ట్వీట్ చేశారు.
At the Bharat Biotech facility in Hyderabad, was briefed about their indigenous COVID-19 vaccine. Congratulated the scientists for their progress in the trials so far. Their team is closely working with ICMR to facilitate speedy progress. pic.twitter.com/C6kkfKQlbl
— Narendra Modi (@narendramodi) November 28, 2020
హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థకు అహ్మదాబాద్ నుంచి నరేంద్ర మోదీ మధ్యాహ్నం చేరుకున్నారు. సుమారు గంట సేపు భారత్‌బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తలతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కృష్ణ ఎల్లాతో పాటు ఇతర శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ వ్యాక్సిన్ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా హాకీంపేట్ చేరుకున్న ప్రధానికి డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం సోమేశ్ కుమార్ స్వాగతం పలికారు. Also read: Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్
అయితే అంతకుముందు ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. మోదీ హైదరాబాద్ పర్యటన అనంతరం పుణే బయల్దేరారు. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ పురోగతిని సాయంత్రం సమీక్షిస్తారు.
Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe