భారత్‌, పాలస్తీనా చిరకాల మిత్రులు: ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 

Last Updated : Feb 10, 2018, 09:40 PM IST
భారత్‌, పాలస్తీనా చిరకాల మిత్రులు: ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. దాదాపు 50 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు తమ మధ్య జరిగాయని.. అలాగే 30 మిలియన్ డాలర్లతో ఇరు దేశాలు కలిసి పాలస్తీనాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి శ్రీకారం చుట్టాయని తెలిపారు. మోదీ మాట్లాడుతూ పాలస్తీనాలో తనకు ఘన స్వాగతం లభించిందన్నారు.

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌‌ను పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడిగా అభిప్రాయపడ్డారు. ఈ దేశంలో శాంతి ఎల్లప్పుడూ ఫరిడవిల్లాలని భారత్ ఆశిస్తుందని మోదీ తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాన మోదీకి పాలస్తీనా పాలకులు ఆ దేశ అత్యున్నత పురస్కారమైన  ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాల్తసీనా’తో సత్కరించారు. పాలస్తీనాను భారత్ స్వతంత్ర దేశంగా గుర్తించినందుకు వారు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, తాను పాలస్తీనాను త్వరలోనే స్వతంత్ర దేశంగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Trending News