PM Modi Speech: ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..దిగజార్చవద్దు

లాక్ డౌన్ ముగిసిపోవచ్చు గానీ వైరస్ వ్యాప్తిం ఇంకా పొంచి ఉందని మర్చిపోవద్దు. దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పరిస్థిితిని దిగజార్చవద్దు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగమిదీ..

Last Updated : Oct 20, 2020, 10:25 PM IST
PM Modi Speech: ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..దిగజార్చవద్దు

లాక్ డౌన్ ( Lockdown ) ముగిసిపోవచ్చు గానీ వైరస్ వ్యాప్తిం ఇంకా పొంచి ఉందని మర్చిపోవద్దు. దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పరిస్థిితిని దిగజార్చవద్దు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra modi speech ) దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగమిదీ..

కరోనా వైరస్ ( Corona virus ) పట్ల గతంలో ఉన్నంతగా భయం ఇప్పుడు ప్రజల్లో ఏ మాత్రం లేదు. ఏం కాదులే అనే నిర్లక్ష్యమే ఎక్కువగా కన్పిస్తోంది. అతి జాగ్రత్తగా ఉంటే త్వరగా వస్తుందంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. కోవిడ్ వ్యాప్తి ( Covid19 virus spread ) ఇంకా పొంచి ఉందనే విషయాన్ని మర్చిపోయి..పండుగలు, షాపింగ్ మాల్స్, వేడుకల్లో సమూహాలుగా హాజరవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాస్క్ కూడా ధరించడం లేదు. ఇక శానిటైజర్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరికీ అవసరం. 

దేశంలో ఇప్పుడు లాక్డౌన్ లేకపోవచ్చు, కానీ కరోనా వైరస్ ఇప్పటికీ ఉందనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు ప్రదాని మోదీ. ఈ పండుగ సీజన్లో మార్కెట్లు మళ్లీ ప్రకాశవంతంగా కళకళలాడుతున్నాయని.. లాక్డౌన్ ముగిసిపోయుండవచ్చు గానీ కొవిడ్ -19 వ్యాప్తి ఇంకా కొనసాగుతుందని గుర్తుంచుకోవాలన్నారు. గత 7-8 నెలలుగా ప్రతి భారతీయుడు చేసిన కఠిన ప్రయత్నాల ద్వారా ఇప్పుడిప్పుడే భారతదేశం స్థిరంగా కొవిడ్19  వైరస్ నుంచి కోలుకుంటోందని.. ఈ పరిస్థితిని దిగజార్చవద్దని మోదీ కోరారు. 

ఇప్పుడు చాలా మంది అసలు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడమే మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ముసుగు లేకుండా బయట తిరగడం ద్వారా, మిమ్మల్ని మీరే కాకుండా మీ కుటుంబం, మీ పిల్లలు, వృద్ధులు , సమాజాన్ని కూడా చాలా ప్రమాదంలో పడేస్తున్నారు అని చెప్పారు మోదీ.

ప్రస్తుతం మనం ఒక సంక్షోభ సమయాన్ని ( Crisis period ) అధిగమించే దశలో ఉన్నాము. ఈ పండగల సమయంలో ఇంట్లో అందరూ ఉల్లాసంగా, ఆనందోత్సహాలతో గడిపే సమయమిది. మనం చేసే అతి చిన్న నిర్లక్ష్యం, మన ఆనందపు మార్గాల్ని చిన్నాభిన్నం చేయవచ్చు. వ్యాక్సిన్ రానంతవరకూ కొవిడ్ నియంత్రణలో మనం బిగించిన పట్టు సడలించవద్దని మోదీ ( Modi ) సూచించారు. అనేక దేశాలలో కరోనా వైరస్ కు మందు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో మనకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటివరకు కొవిడ్ నియంత్రణలో ఏ మాత్రం విశ్రాంతి తీసుకోవద్దు. కొవిడ్19 ముప్పును తక్కువగా అంచనా వేయవద్దంటూ ప్రధాని మోదీ ప్రజలను హెచ్చరించారు. Also read: Hyderabad Rains: హైదరాబాద్ చేరుకున్న 40 బోట్లు

Trending News