సాధారణంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రధాని ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని (విధాన నిర్ణాయక సంస్థల బాధ్యులు) ఎర్రకోటపై మువ్వెన్నల జెండా ఎగరేస్తారు. కానీ ఈ రోజు మరోమారు ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం ఆజాద్ హింద్ ఫౌజ్ మ్యూజియానికి శంకుస్థాపన చేస్తారు.
Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort to mark the 75th anniversary of the proclamation of ‘Azad Hind Sarkar’, today. pic.twitter.com/m17Jr46sz9
— ANI (@ANI) October 21, 2018
నేతాజీ కలలు నెరవేరడం లేదు
'దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని నేతాజీ భావించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా.. నేతాజీ కలలు నెరవేరడం లేదు. 'డివైడ్ అండ్ రూల్' అనే సిద్ధాంతాన్ని నేతాజీ వ్యతిరేకించారు. దేశానికి ఎంతో సేవ చేసిన నేతాజీని గుర్తు చేసుకోవడానికి కూడా కొందరు ఇష్టపడటం లేదు.' అని ప్రధాని మోదీ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగంలో తెలిపారు.
నేతాజీ సుభాస్ చంద్రబోస్ అజాద్ హింద్ ప్రభుత్వాన్ని స్థాపించి నేటికి డెబ్బై ఐదేళ్లు(అక్టోబర్ 21, 1943) అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ జెండా ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ దేశమే లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి సుభాస్ చంద్రబోస్. భారతదేశ స్వాతంత్య్రం కోసం సుభాస్ చంద్రబోస్ అజాద్ హింద్ ప్రభుత్వాన్ని స్థాపించారు.
ఈ నెలాఖర్లోనే ఇంకో ముఖ్యమైన రోజు ఉంది. అదే అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ జయంతి. ఆ రోజు గుజరాత్‌లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.
ప్రధాని మోదీ బుధవారం వీడియో ద్వారా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. 'అక్టోబర్ 21న జెండా వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అక్టోబర్ 21, సుభాష్ చంద్రబోస్ 'ఆజాద్ హింద్ ప్రభుత్వానికి 75 ఏళ్లు' అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటేల్, బోస్, అంబేద్కర్ లను విస్మరించినప్పటికీ.. దేశ నిర్మాణాన్ని దోహదపడిన ప్రతి ఒక్కరినీ బీజేపీ గుర్తుకు తెస్తుందన్నారు.
నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎల్ కే అద్వానీ అమరవీరులకు నివాళులర్పించారు.