Modi Sends Footwear: కాశీ శివుని గుడిలోని సిబ్బందికి 100 జతల చెప్పులు పంపిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

Modi Sends Footwear: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది కోసం జనపనార (జూట్)తో తయారు చేసిన 100 జతల చెప్పులను పంపారు. ఆలయంలోకి తోలు, రబ్బరు చెప్పులకు అనుమతి లేని కారణంగా వారికి ఈ పాదరక్షలను పంపినట్లు తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 09:30 AM IST
    • కాశీ విశ్వనాథ్ ఆలయంలోని సిబ్బందికి మోదీ నుంచి కానుక
    • 100 జతల జూట్ చెప్పులను పంపిన మోదీ
    • చలి నుంచి సిబ్బంది రక్షణ కోసం పాదరక్షలు పంపినట్లు అధికారులు వెల్లడి
Modi Sends Footwear: కాశీ శివుని గుడిలోని సిబ్బందికి 100 జతల చెప్పులు పంపిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

Modi Sends Footwear: వారణాసిలోని పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో పని చేసే సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఊహించని కానుక వచ్చింది. ఆ సిబ్బంది కోసం ప్రధాని మోదీ 100 జతల పాదరక్షలను (చెప్పులు) పంపారు. డిసెంబరు 13న కాశీ విశ్వనాథ్​ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఆలయ ప్రాంగణంలోని కార్మికులు చెప్పుల్లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు మోదీ. అందుకోసం అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జనపనారతో తయారు చేసిన చెప్పులను పంపారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఇటీవలే కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించేందుకు వారణాసికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ పనిచేసే సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి.. వారిపై పూలవర్షాన్ని కురింపించారు. వారితో కలిసి భోజనం చేశారు. 

అయితే ఆ సమయంలో సిబ్బంది చెప్పులు లేకుండా పనిచేయడాన్ని ప్రధాని మోదీ గమనించారు. చెప్పులు లేకుండా తీవ్రమైన చలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన తెలుసుకున్నారు. దీంతో వారి కోసం జనపనారతో ప్రత్యేకంగా తయారు చేసిన పాదరక్షలను (చెప్పులు) మోదీ పంపించారు. 

కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంగణంలోకి తోలు లేదా రబ్బరుతో తయారు చేసిన చెప్పులను ధరించడం నిషేదం. ఈ నేపథ్యంలో ఆలయంలో పనిచేసే పూజారులు, సేవకులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ కార్మికులు వంటి వారు ఇప్పటి వరకు చెప్పులు లేకుండానే వారి వారి విధులను నిర్వర్తించారు. ఇప్పుడు ప్రధాని మోదీ పంపిన జ్యూట్ చెప్పులు ధరించి.. ఆలయ ప్రాంగణంలో పని చేయవచ్చు.  

Also Read: Corona Third Wave: సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ప్రమాదకరమైందంటున్న కేంద్ర ప్రభుత్వం

Also Read: BJP chief tests positive : వరుసగా కోవిడ్ బారినపడుతోన్న బీజేపీ నేతలు.. అధ్యక్షుడికి కరోనా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి   

Trending News