2019 ఎన్నికల్లో విజయం సాధిస్తే.. మరో 50 సంవత్సరాల వరకు బీజేపీదే రాజ్యం: అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ.. మరో 50 సంవత్సరాల వరకూ బీజేపీదే రాజ్యమని తేల్చి చెప్పారు. 

Last Updated : Sep 9, 2018, 11:48 PM IST
2019 ఎన్నికల్లో విజయం సాధిస్తే.. మరో 50 సంవత్సరాల వరకు బీజేపీదే రాజ్యం: అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ.. మరో 50 సంవత్సరాల వరకూ బీజేపీదే రాజ్యమని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా తాము కచ్చితంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ నేత ఈ స్టేట్‌మెంట్‌ని గర్వంతో చేయలేదని.. పార్టీ ప్రజల కోసం పాటుపడుతున్న తీరును బట్టి మాట్లాడారని తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ కొత్త నినాదంతో వస్తుందని.. "అజేయ్ భారత్.. అటల్ బీజేపీ" అన్న స్లోగన్‌తో తాము ముందుకు పోతామని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ స్వయంగా ఈ నినాదాన్ని ప్రతిపాదించారని.. విలువల కోసం పాటుపడే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు.

అదే విధంగా 2022 సంవత్సరానికల్లా "న్యూ ఇండియా"కి రూపకల్పన చేయడం బీజేపీ లక్ష్యమని.. ఈ సరికొత్త భారతదేశంలో పూర్తిస్థాయిలో పేదరిక నిర్మూలన జరుగుతుందని బీజేపీ నేత రాజనాథ్ సింగ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతున్న సందర్భంగా హెచ్ఆర్‌డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా తన భావాలను పంచుకున్నారు. "భారత ప్రధానికి ఒక లక్ష్యం..ధ్యేయం..ఆలోచన ఉన్నాయని.. ఆయన ప్రజలతో స్వయంగా మమేకమై వారి కష్టాలను తెలుసుకొని.. వాటిని పరిష్కరిస్తున్నారు కాబట్టే 70 శాతం ప్రజలు ఆయనకు పట్టం కట్టేందుకే ముందుకు వస్తున్నారని" తెలిపారు. 

బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "భారత ప్రధాని ఒకటే మాట అన్నారు. నిన్నటి వరకూ ఒకరి కళ్లలోకి ఒకరు కళ్లు పెట్టి చూసుకోలేని పార్టీలు ఇప్పుడు.. బీజేపీని ఓడించడానికి కూటమిగా ఏర్పడాలని అనుకుంటున్నాయి. తమ కాళ్ల మీద తాము నిలబడడం చేతకాని పార్టీలు ఇప్పుడు ఏకమై మమ్మల్ని ఓడించాలని భావిస్తున్నాయి. ఇదే మా అతి పెద్ద విజయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 48 సంవత్సరాలలో తీసుకురాలేని మార్పులను.. మోదీ ప్రభుత్వం 48 నెలలలో తీసుకొచ్చింది. ఇదే మా విజయం" అని తెలిపారు.

Trending News