PM Modi Mother Health: క్షీణించిన ప్రధాని మోదీ తల్లి ఆరోగ్యం.. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిక!

PM Narendra Modis mother Heeraben Modi hospitalized. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్యం క్షీణించింది. అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమె చేరారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 28, 2022, 01:30 PM IST
  • క్షీణించిన ప్రధాని మోదీ తల్లి ఆరోగ్యం
  • అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిక
  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
PM Modi Mother Health: క్షీణించిన ప్రధాని మోదీ తల్లి ఆరోగ్యం.. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిక!

PM Narendra Modis mother Heeraben Modi admitted to hospital in Ahemdabad: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్యం క్షీణించింది. దాంతో బుధవారం ఉదయం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి ప్రధాని మోదీ తల్లిని తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యం అందిస్తున్నారు. అయితే హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జూన్ 18న హీరాబెన్ మోదీకి 100 ఏళ్లు నిండాయి. పుట్టినరోజు సందర్భంగా వాద్‌నగర్‌లోని హత్కేశ్వర్ ఆలయంలో పూజ జరిగింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీని గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన తల్లి పక్కన కూర్చొని కాసేపు మాట్లాడారు. ఆపై మోదీ తన తల్లి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. మోదీ తల్లి ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

మైసూరు సమీపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మరియు ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు మంగళవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ, ఆయన కుమారుడు, కోడలు గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో ప్రహ్లాద్ మోదీ, ఆయన కొడుకు, కోడలు, మనవడు ఉన్నారు. మైసూరు నుంచి చామరాజనగర-బందీపురాకు కారులో వెళుతుండగా.. కడకోల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Also Read: Dhoni Daughter Ziva: ఎంఎస్ ధోనీ కుమార్తెకు మెస్సి అదిరిపోయే గిఫ్ట్.. విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్న ఫాన్స్!  

Also Read: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారులో లోపాలు.. కొనడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News