Modi Turban: ఇండిపెండెన్స్ డే వేళ ప్రత్యేక ఆకర్షణగా మోదీ తలపాగ.. ఈ సారి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Independence day 2024: దేశ వ్యాప్తంగా  78 వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానిమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన వేసుకున్న తలపాగ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 15, 2024, 10:46 AM IST
  • దేశంలో ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు..
  • మరోసారి హైలేట్ గా మోదీ టర్బన్..
Modi Turban: ఇండిపెండెన్స్ డే వేళ ప్రత్యేక ఆకర్షణగా మోదీ తలపాగ.. ఈ సారి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

PM Modi look Rajasthani leheriya turban and blue jacket: నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మోదీ 3.0 పాలన కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా   78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరువాడ, పల్లె పట్నం తేడా లేకుండా.. ప్రతిచోట ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు కూడా జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా.. ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో 10 సార్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాజాగా, మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించడంతో ఆ రికార్డును అధిగమించినట్లైంది. ఇదిలా ఉండగా. ప్రధాని మోదీ ప్రతిసారి ఇండిపెండెన్స్ వేళ, ప్రత్యేకంగా తలపాగలు వేసుకుంటారు. 78 వ ఇండిపెండెన్స్ వేళ 11 వ సారి జాతీయ జెండా ఆవిష్కరణ వేళ మోదీ ధరించిన తలపాగ మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు..

దేశ ప్రధాని మోదీ ఢిల్లీ లోని ఎర్రకోట మీద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.  ఆ తర్వాత జాతీయగీతాలాపన చేశారు. అంతేకాకుండా.. మనదేశానికి ఇండిపెండెన్స్ డే తీసుకొని రావడానికి, తమ ప్రాణాలను సైతం అర్పించిన దేశ భక్తులను, వారిత్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. మోదీ..వేసుకున్న కాస్ట్యూమ్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్ వేసుకున్నారు. అంతేకాకుండా..  లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్‌ ధరించారు. ముఖ్యంగా ఆయన ఇవాళ (ఆగస్టు 15) రాజస్థానీ సంప్రదాయానికి చెందిన లెహెరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు  ప్రతిసారి.. ఏదో ఒక స్పెషాలిటీ ఉన్న తలపాగల్ని ధరిస్తుంటారు.  ఇవాళ ప్రధాని మోదీ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. తలపాగాకు ఉన్న పొడవాటి దారం కూడా మూడు రంగుల కలయికలోనే ఉంది. రాజస్థాన్‌కు చెందిన సాంప్రదాయ టెక్స్‌టైల్ టెక్నిక్‌తో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ లెహెరియా డిజైన్‌ను థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా ప్రకారం తయారు చేసినట్లు తెలుస్తోంది.

Read more: Independence Day 2024: కోల్ కతా ట్రైయినీ డాక్టర్ ఘటన.. ఇండిపెండెన్స్ డే వేళ సంచలన ట్విట్ చేసిన ఉపాసన..   

మరోవైపు మోదీ గతేడాది.. పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసిన రాజస్థానీ బంధాని ప్రింట్ తలపాగాను వేసుకున్నారు. ఈ విధంగా ప్రతిసారి మోదీ వెరైటీగా తలపాగలను ధరిస్తారు. అంతేకాకుండా మోదీ ఎక్కడికి వెళ్లిన, ఆయా ప్రదేశంలోకి సంప్రదాయం, సంస్కృతిని ఉట్టిపడే విధంగా.. మోదీ డ్రెస్సింగ్ వేసుకుని అందరిని ఆకర్శిస్తుంటారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News