PM Kisan Samman Nidhi Yojana 15th Installment: రైతులను ఆర్థికం బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. పెట్టుబడి సాయంగా కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా ఏడాదికి రూ.6 వేలు అందజేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 14వ విడతల్లో నగదు జమ చేసింది. ఇటీవలె 2000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు లేటెస్ట్ అప్‌డేడ్ వచ్చింది. 15వ విడత డబ్బులు కావాలంటే ముఖ్యమైన మూడు పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేయకపోతే మీ ఖాతాలో నగదు జమ అవ్వదు.
15వ విడత నగదు కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ఏ రైతు అయినా.. మీ సేవా కేంద్రాన్ని సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా కూడా పీఎం కిసాన్ యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు.
==> రైతులు తమ భూమికి సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది
==> మీ ఆధార్ కార్డును యాక్టివ్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం ముఖ్యం.
==> రైతులు తమ ఈకేవైసీని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
15వ విడతకు సంబంధించిన నిధులను నవంబర్ లేదా డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. 14వ విడత డబ్బులను జూలై 27న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17 వేల కోట్లు జమ అయిన విషయం తెలిసిందే. మీ అకౌంట్‌లో 14వకు సంబంధించిన నగదు ఇంకా రాకపోతే.. మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092 నంబర్లలో సంప్రదించవచ్చు. pmkisan-ict@gov.in కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వొచ్చు.
Also Read: Minor Boys Married: వింత ఆచారం.. ఐదో తరగతి అబ్బాయిలకు పెళ్లి చేసిన గ్రామస్తులు
Also Read: Ishan Kishan: ధోనీ ఆడిన జార్ఖండ్ జట్టుకు ఇషాన్ కిషన్ ఎందుకు మారాడు..? అసలు నిజం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook