PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్యగమనిక.. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమకానుందంటే..?

PM Kisan Beneficiary Status: పీఎం కిసాన్ యోజన పథకం కింద దేశంలో రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.6 వేల నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం 13వ విడత నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎప్పుడు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయి..? లబ్ధిదారుల లిస్టులో పేరు ఉందో లేదో ఎలా చూసుకోవాలి..? వివరాలు ఇవిగో..   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 01:34 PM IST
PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్యగమనిక.. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమకానుందంటే..?

PM Kisan Beneficiary Status: దేశంలో రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని.. పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు పడకుడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ పథకం కింద ప్రతి యేటా ఆరు వేల రూపాయల నగదు సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. రూ.2 వేల చొప్పున సంవత్సరానికి మూడు వాయిదాల్లో నగదు వేస్తోంది. ఇప్పటివరకు రైతులకు 12వ విడతల్లో డబ్బు జమ అవ్వగా.. ప్రస్తుతం 13వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. హోలీకి ముందే రైతుల ఖాతాలో నగదు జమకానుందని ప్రచారం జరుగుతోంది.

చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ పథకాన్ని ప్రకటించారు.  2019 ఫిబ్రవరి 24 నుంచి ఈ పథకం అమలులో ఉంది. ఈ నెల 23 నాటికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించి నాలుగేళ్లు కూడా పూర్తి చేసుకోనుంది. ఈ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు జమ అవుతుంది.

లబ్ధిదారుల జాబితాలో మీరు ఇలా చెక్ చేసుకోండి..
 
==> పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి 
==> హోమ్ పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి 
==> రైతుల కార్నర్ మెనులో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌ను ఎంచుకోండి. 
==> డ్రాప్-డౌన్ మెను నుంచి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్‌ను ఎంచుకోండి. 
==> 'గెట్ రిపోర్ట్' ఎంచుకోండి. 
==> పైభాగంలో మీ పేరుతో పాటుగా లబ్ధిదారులందరి జాబితా కనిపిస్తుంది.

ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.

ఇటీవలె ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లబ్ధిదారులకు కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఏ రైతు కూడా భాష పరంగా ఇబ్బంది పడకుండా.. చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు పంటల బీమా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తున్నట్లు చెప్పారు. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్, ఎన్‌సీఐ పోర్టల్‌లో హిందీ, ఇంగ్లీష్‌తో సహా 12 ప్రాంతీయ భాషల్లో పంట బీమా సంబంధిత సమాచారాన్ని పొందవచ్చని వెల్లడించారు. 

Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్   

 Also Read: Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News