PM Kisan Nidhi: అన్నదాతలకు గుడ్ న్యూస్, ఈ నెలలోనే 11వ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు, ఎలా చెక్ చేసుకోవాలంటే

PM Kisan Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు కోసం చూస్తున్నారా..అయితే అన్నదాతలకు గుడ్‌న్యూస్. త్వరలో మీ ఖాతాల్లో ఆ డబ్బులు జమ కానున్నాయి. మీ స్డేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2022, 01:54 PM IST
  • ప్రధానమంత్రి కిసాన్ నిధి డబ్బులు ఈ నెలలోనే జమ
  • పీఎం కిసాన్ నిధి డబ్బుల స్టేటస్ ఎలా చెక్ చేయాలి
  • పీఎం కిసాన్ నిధి జాబితాలో మీ పేరుందో లేదో చూసుకున్నారా
 PM Kisan Nidhi: అన్నదాతలకు గుడ్ న్యూస్, ఈ నెలలోనే 11వ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు, ఎలా చెక్ చేసుకోవాలంటే

PM Kisan Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు కోసం చూస్తున్నారా..అయితే అన్నదాతలకు గుడ్‌న్యూస్. త్వరలో మీ ఖాతాల్లో ఆ డబ్బులు జమ కానున్నాయి. మీ స్డేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఏడాదికి 6 వేల రూపాయలు జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని 3 వాయిదాల్లో అంటే నాలుగు నెలలకోసారి అందిస్తోంది. ఇప్పుడు 11వ విడత డబ్బులు రావల్సి ఉన్నాయి. ఆ డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూసే రైతన్నలకు ఇది శుభవార్త. త్వరలో ఆ డబ్బుల్ని రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసయనుంది. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు ఏప్రిల్ నెలలో అంటే ఈ నెలలోనే అందనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన సమస్యలు, డబ్బులు ఎప్పుడొస్తాయి, స్టేటస్ చెక్ వంటివి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. 011-23381092, 155261 లను లేదా 1800115526 నెంబర్లను సంప్రదించవచ్చు. 

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధి 10 వ విడత డబ్బులు జనవరి 1వ తేదీన విడుదలయ్యాయి. దేశంలోని 10.9 కోట్ల మంది లబ్దిదారుల్లో ఖాతాల్లో మొత్తం 20 వేల 9 వందల కోట్లు జమయ్యాయి. మీ ఎక్కౌంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా..లేదా నగదు మీ ఎక్కౌంట్‌లో పడిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కు కుడివైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్ క్లిక్ చేయాలి. ఆ తరువాత బెనిఫిషియరీ స్టేటస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకొక జాబితా కన్పిస్తుంది. అందులో మీ పేరుందో లేదో చూసుకోవాలి.

Also read: Delhi Violence: దేశ రాజధానిలో మరోసారి హింస, హనుమాన్ జయంతి ర్యాలీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News