Coronacrisis: ఏప్రిల్ 8న కరోనాపై ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశం..

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ విపత్కరమైన పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన తరవాత ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై రాజకీయ పార్టీలతో ప్రదాని ఏర్పాటు చేయబోతోన్న మొదటి సమావేశం.   

Last Updated : Apr 4, 2020, 08:44 PM IST
Coronacrisis: ఏప్రిల్ 8న కరోనాపై ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశం..

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ విపత్కరమైన పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన తరవాత ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై రాజకీయ పార్టీలతో ప్రదాని ఏర్పాటు చేయబోతోన్న మొదటి సమావేశం. 

Read Also: హమ్మయ్య.. ఆ సింగర్‌కి ఆరోసారికి కరోనా నెగటివ్ ఫలితం

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటులో ఐదుగురు సభ్యులను కలిగి ఉన్న హౌస్ ఆఫ్ పార్టీల నాయకులను సమావేశానికి హాజరుకావాలని లేఖ ద్వారా ఆహ్వానించారు. సామాజిక దూరం, ప్రయాణ పరిమితుల ప్రమాణాల దృష్ట్యా, విపత్కర సమయంలో అత్యవసర సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుందని పేర్కొన్నారు.  

Also Read: Plasma collection: కోలుకున్న వాళ్ల ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్ రోగులకు ఎక్కించే వైద్యం

కరోనావైరస్, తదితర ముఖ్యమైన అంశాలపై అఖిలపక్షాన్ని సమావేశపర్చాలని, పలువురు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, రైతులు, వలసకార్మికుల పరిస్థితిపై, దేశ ఆర్థిక వ్యవస్థపై, వినాశకరమైన ప్రభావం నేపథ్యంలో అన్ని పార్టీలతో పరిస్థితిని చర్చించడానికి దీనిని ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. 

Read Also: కరోనాతో 15 మంది ఎన్నారైలు మృతి

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంపై విస్తృత రాజకీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి ఒక అవకాశం అని ఒక అధికారి తెలిపారు.ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుందని తెలిపారు. మోడీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి, రాజ్యసభ నాయకుడు తవార్ చంద్ గెహ్లోట్ కూడా హాజరుకానున్నారని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News