Petrol Price Today: భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో దేశంలోనే అధిక ధరలు

Petrol Price Today In Hyderabad On January 18, 2021 Updates: భారత్‌లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా జనవరి 18 (సోమవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు, డీజిల్‌ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 18, 2021, 03:12 PM IST
  • కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి
  • భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో దేశంలోనే అధిక ధరలు
  • లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు, డీజిల్‌ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది
Petrol Price Today: భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో దేశంలోనే అధిక ధరలు

Petrol Price Today In Hyderabad On January 18, 2021: భారత్‌లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా జనవరి 18 (సోమవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు, డీజిల్‌ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది. పెరిగిన ధరలతో సోమవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి.

హైదరాబాద్‌(Hyderabad)లోనూ వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. నగరంలో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగింది. దీంతో జనవరి 18న పెట్రోల్ ధర లీటర్‌కు రూ.88.37 అయింది. అదే సమయంలో డీజిల్‌ ధర కూడా 26 పైసలు పెరిగడంతో లీటర్ ధర రూ.81.99కు చేరింది. 

Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి 

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం.. తాజాగా పెట్రోల్‌, డీజిల్ లీటర్‌ ధర 25 పైసలు చొప్పున పెరగడంతో ఢిల్లీ(Delhi)లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95 అయింది. డీజిల్‌ ధర రూ.75.13కు చేరింది. పెట్రోల్‌ ధర చెన్నైలో రూ.87.63, కోల్‌కతాలో రూ.86.39, ముంబైలో గరిష్టంగా రూ.91.56కి చేరింది. 

Also Read: Hike Messaging APP Shuts Down: హైక్ మెసేజింగ్ యాప్ సేవలు బంద్.. హైక్ మెసేంజర్ చరిత్ర ఇది..

హైదరాబాద్‌లో అత్యధికంగా డీజిల్ ధరలు:  ఇక డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.75.13కు చేరగా.. ముంబబైలో రూ.81.87, చెన్నైలో రూ.80.43, కోల్‌కతాలో రూ.78.72గా ఉంది. అయితే డీజిల్‌ ధర మాత్రం దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఉంటోంది. 

 Also Read: How To Secure Whatsapp: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News