Petrol Price Today In Hyderabad 19 February 2021: చమురు ధరలు పెరగడంతో పెట్రో మంట కొనసాగుతోంది. వరుసగా 11వ రోజు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఫిబ్రవరి 19 (శుక్రవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు, డీజిల్ ధర 33 పెసలు చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో శుక్రవారం నాడు ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం తాజాగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్(Hyderabad)లో శుక్రవారం ఉదయం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.93.78, డీజిల్ ధర రూ.87.91కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.
Also Read: Paytm Offer: పేటీఎం బెస్ట్ ఆఫర్, కేవలం రూ.10 చెల్లించి ఈ ప్రయోజనాలు పొందండి
దేశ రాజధాని ఢిల్లీ(New Delhi)లో లీటర్ పెట్రోల్ ధర తాజాగా రూ.90 దాటింది. నేడు 1 లీటర్ పెట్రోల్ ధర రూ.90.19, డీజిల్ ధర రూ.80.60కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గరిష్టంగా రూ.96.62కి చేరగా, డీజిల్ ధర రూ.87.67 అయింది.
Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook