పద్మావత్ సినిమా వివాదాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెబుతూ కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం, సుప్రీం కోర్టు రెండూ కలిసి కూడా ఒక సినిమాను అన్ని రాష్ట్రాల్లో విడుదల అయ్యేలా చూసుకోకపోతే ఇక దేశంలోకి బయటి నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు. "విదేశీ పెట్టుబడుల సంగతి సరే.. పరిస్థితులు ఇలాగే వుంటే, స్వదేశంలో వున్న పెట్టుబడిదారులు సైతం పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తారు. ఇప్పటికే సంక్షోభంలో వున్న ఆర్థిక రంగానికి ఇది అంత శుభ పరిణామం కాదు" అని అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని విమర్శించారు. అంతేకాకుండా ఇది భారత్‌లో ఉపాధి అవకాశాలపై సైతం ప్రభావం చూపిస్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
If all state govts, central govt and SC together cannot get one movie released and run safely, how can we expect investments to flow in? Forget FDI, even local investors wud feel hesitant. Not gud for already dwindling economy. Bad for jobs
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 24, 2018
సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన పద్మావత్ సినిమా ప్రీమియర్ షోల ప్రదర్శన నేపథ్యంలో గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శించిన థియేటర్ల వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారు.