నేడు ప్రముఖులకు పద్మ పురస్కారాల ప్రదానం

పేదలకు సేవ, ఉచిత పాఠశాలలు ఏర్పాటు, ప్రపంచవ్యాప్తంగా గిరిజన కళలు ప్రజాదరణ చేసిన అనేకమంది ప్రముఖులకు ఈ ఏడాది భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించింది.

Last Updated : Mar 20, 2018, 04:09 PM IST
నేడు ప్రముఖులకు పద్మ పురస్కారాల ప్రదానం

ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఇళయరాజా, హిందూత్వ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ పరమేశ్వరన్ సహా 41 మంది ప్రముఖ వ్యక్తులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేబినేట్ మంత్రులు హాజరుకానున్నారు.

పేదలకు సేవ, ఉచిత పాఠశాలలు ఏర్పాటు, ప్రపంచవ్యాప్తంగా గిరిజన కళలు ప్రజాదరణ చేసిన అనేకమంది ప్రముఖులకు ఈ ఏడాది భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించింది. ఈ ఏడాది ముగ్గురికి పద్మవిభూషణ్‌, తొమ్మిది మందికి పద్మభూషణ్‌ సహా 84 మందికి పద్మ అవార్డులు ఇస్తామని కేంద్రం తెలిపింది.

 ఏటా గణతంత్ర దినోత్సవంనాడు పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తారు. కళ, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, వైద్యం, ప్రజాసేవ, విజ్ఞానశాస్త్రం, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు అందిస్తారు. మిగిలిన గ్రహీతలకు పద్మ పురస్కారాలను ఏప్రిల్ 2న మరో ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Trending News