Our soldiers are 'suraksha kawach' of 'Maa Bharti': PM Narendra Modi Diwali Celebrations in J&K: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) రాజౌరి (Rajouri) లోని సైనిక శిబిరాల్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నౌషెరా సెక్టార్ లో (Nowshera sector) ప్రధాని పర్యటించారు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలొదిలిన సైనికులకు నివాళులు అర్పించారు.
తర్వాత.. సైనికులతో మాట్లాడారు. వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. సైనికులకు (soldiers) స్వీట్లు తినిపించారు. సైనికులతో సరదాగా గడిపారు మోదీ. తాను ప్రతీ దీపావళిని బోర్డర్ (Border) లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు (Diwali celebrations) జరుపుకుంటున్నారు. తాను ప్రధానిగా ఇక్కడికి రాలేదన్నారు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు. సైన్యం కోసం 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకొచ్చానని మోదీ తెలిపారు. ప్రతీ దీపావళి సైనికులతో జరుపుకుంటున్నానన్నారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సైనికుల వల్లే దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని మోదీ (Modi) పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ (Surgical strike) సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమన్నారు.
Also Read : F3 Movie: సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న ఎఫ్3.. దీపావళి స్పెషల్ వీడియో రిలీజ్
ఈ సందర్భంగా సర్జికల్ స్ట్రైక్స్ తాలూకు సంఘటనలు గుర్తుచేసుకున్నారు మోదీ. సర్జికల్ స్ట్రైక్ రోజు.. సైనికులు చూపిన తెగువ మరిచిపోలేదని మోదీ పేర్కొన్నారు. అది దేశ ప్రజలను గర్వంతో ఉప్పొంగేలా చేసిందన్నారు. ఆరోజును ఎప్పటికీ మరిచిపోను చెప్పారు. ఆ రోజంతా ఫోన్ పక్కనే ఉన్నానని... సైనికుల యోగక్షేమాలు తెల్సుకుంటూ గడిపానని మోదీ (Modi) గుర్తు చేసుకున్నారు. సైన్యానికి అత్యాధునిక ఆయుధ సామగ్రి సమకూరుస్తున్నామని మోదీ తెలిపారు. తేజస్, అర్జున్‌లాంటి ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఆయుధ సంపత్తితో సైనిక శక్తిని బలోపేతం చేస్తున్నామన్నారు. ఆయుధాలు సమకూర్చుకోవడంలోనూ స్వయం సమృద్ధి సాధిస్తున్నామన్నారు. 200కి పైగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని మోదీ తెలిపారు. సైన్యం సరిహద్దుల్లోనే కాపలా కాయట్లేదని.. రాష్ట్రాలకూ రక్షణగా నిలుస్తోందని, దేశానికి సైన్యం సురక్షా కవచం అని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.
Also Read : Acharya Second Single: ఆచార్య నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డేల నీలాంబరి పాట ప్రోమో వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook