Indian Presidential Election-2022: ఉత్కంఠగా రాష్ట్రపతి ఎన్నిక..విపక్షాల అభ్యర్థి నామినేషన్‌ దాఖలు..!

Indian Presidential Election-2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసే అభర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. 

Written by - Alla Swamy | Last Updated : Jun 27, 2022, 01:41 PM IST
  • దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హడావిడి
  • కొనసాగుతున్న నామినేషన్‌ ప్రక్రియ
  • తాజాగా యశ్వంత్ సిన్హా నామినేషన్‌
Indian Presidential Election-2022: ఉత్కంఠగా రాష్ట్రపతి ఎన్నిక..విపక్షాల అభ్యర్థి నామినేషన్‌ దాఖలు..!

Indian Presidential Election-2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసే అభర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మొన్న బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. ఈకార్యక్రమంలో ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు బీజేపీ పెద్దలు పాల్గొన్నారు. తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి యశ్వంత్ సిన్హా అందజేశారు. 

అంతకుముందు పార్లమెంట్‌లో విపక్ష నేతలంతా భేటీ అయ్యారు. యశ్వంత్ సిన్హా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు.  ఆ తర్వాత విపక్ష నేతలంతా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరు ఒకే వేదికపై కలవడం ఇదే తొలిసారి. వీరితోపాటు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ, ఎన్సీపీ,వామపక్ష నేతలతోపాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. 

కాసేపట్లో విపక్షనేతలంతా మరోసారి భేటీకానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్ర అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా..కేంద్రమంత్రిగా సేవలందించారు. అడ్మినిస్ట్రేటర్‌, పార్లమెంటేరియన్‌గా పనిచేశారు.

Also read:Gang Rape: తల్లీ, ఆరేళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్.. కదులుతున్న కారులోనే కీచకపర్వం 

Also read:Rahul KTR: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News