Opposition Parties Meeting: బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహం.. కూటమి పేరు ఖరారు..!

Patriotic Democratic Alliance: కేంద్రం బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశంలోని విపక్ష పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో కూటమిగా ఏర్పడనున్నాయి. వచ్చే నెలలో ప్రతిపక్షాల అజెండా వెల్లడికానుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 25, 2023, 02:09 PM IST
Opposition Parties Meeting: బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహం.. కూటమి పేరు ఖరారు..!

Patriotic Democratic Alliance: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు జట్టు కడుతున్నాయి. ప్రతిపక్షాల కూటమి పేరు పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ (పీడీఏ)గా నిర్ణయించినట్లు సమాచారం. సిమ్లాలో జరిగే సమావేశంలో పీడీఏ పేరును ప్రకటించే అవకాశం ఉంది. పాట్నాలో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్ ఇంట్లో 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో సహా 15 పార్టీలు బీజేపీని ఓడించేందుకు ఏకమైనట్లు ఇప్పటికే ప్రకటించాయి. నితీష్ కుమార్ స్థాయి జాతీయ స్థాయిలో కీలకం కానుండగా.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ మరోసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపేందుకు సమావేశమైన విపక్ష పార్టీల నేతలు.. కీలక అంశాంలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

పీడీఏ పేరుపై ఇంకా చర్చ జరగలేదని కాంగ్రెస్ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష కూటమి పేరు పీడీఏగానే ఉంటుందని సీపీఐ తెలిపింది. అంతకుముందు అఖిలేష్ యాదవ్ పీడీఎకు వెనుకబడిన, దళిత, మైనారిటీ కూటమి నినాదాన్ని కూడా ఇచ్చారు. విపక్ష పార్టీ తదుపరి సమావేశం సిమ్లాలో జూలై 12 నుంచి 14 వరకు జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పీడీఏ పేరుతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 15 పార్టీలు ఉమ్మడి అజెండాను ప్రకటించే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలు అన్ని రెడీ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి.. బీజేపీకి సవాల్‌ విసిరేందుకు బలమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు వ్యూహం రచిస్తున్నారు. బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విపక్ష పార్టీల సమావేశానికి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు.

ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పాటు చేయడంపై బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Also Read: Shriya Saran:  అందాల బాంబ్ పేల్చిన శ్రియా.. ఉర్పీ జావేద్ కాపీ అంటూ ట్రోలింగ్

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News