Mumbai: దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగ(Vinayaka Chavithi Festival) జరుపుకుంటున్నారు. కోవిడ్(Covid) కారణంగా గత ఏడాది ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
వినాయక చవితి ఉత్సవాలు అనగానే ముందుగా ముంబై(Mumbai) పేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక మహారాష్ట్రలో ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణె(Pune)లోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాలు ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందినవి.
Also read: Ganesh Chaturthi 2021: వినాయక చవితి ప్రాముఖ్యత, తిథి ముహూర్తం, ఇష్టమైన ప్రసాదం
వినాయక చవితి సందర్భంగా ముంబై, పుణె(Pune) ఆలయాల్లో భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్ పేరిట భారీ ఎత్తున మోదక్‌లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు హల్వాయి గణపతికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 5 కిలోగ్రాముల బంగారు కిరీటాన్ని(Gold Crown) గణేషుడికి సమర్పించారు. పర్వదినం సందర్భంగా భక్తులు వినాయకుడిని కొత్త దుస్తులు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం బంగారు కిరీటాన్ని అలంకరించారు. 21 కేజీల మహాప్రసాదిన్ని నివేదించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook