Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపికబురు.. త్వరలోనే ఓపీఎస్ బెనిఫిట్స్ అమలు

Old Pension Scheme Latest Update: తమకు పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2023, 01:12 PM IST
Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపికబురు.. త్వరలోనే ఓపీఎస్ బెనిఫిట్స్ అమలు

Old Pension Scheme Latest Update: ఇటీవలె డీఏ పెంపు శుభవార్త అందుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తుండగా.. తమకు కూడా పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్త పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేసి.. ఉద్యోగులకు మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.   

పాత పెన్షన్ స్కీమ్‌ విధానం అమలు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానమే అమలు చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది. కొత్త పెన్షన్ స్కీమ్‌లో గ్యారెంటీడ్ రిటర్న్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది. ఇందులో కొత్త పెన్షన్ స్కీమ్‌లోనే ఉద్యోగులు పాత పెన్షన్‌ను పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

కొత్త పెన్షన్ స్కీమ్‌లో కూడా కనీస హామీ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వం తన సహకారాన్ని 14 శాతానికి పైగా పెంచాలని యోచిస్తోంది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా కంట్రిబ్యూషన్ ఎలా పెంచవచ్చన్న దానిపై ప్రభుత్వం చర్చిస్తోంది. పాత పెన్షన్ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. చివరగా డ్రా చేసిన జీతం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం రేటు పెరగడంతో డీఆర్ కూడా పెరుగుతుంది. ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను అమలు చేస్తే.. పెన్షన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. అందుకే పాత పెన్షన్ విధానానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు.

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు 2023ను సమర్పించిన సందర్భంగా పెన్షన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ప్రకటించారు. జాతీయ పింఛను పథకానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా కొత్త పెన్షన్ విధానాలను రూపొందిస్తామన్నారు. ఉద్యోగుల అవసరాలను తీర్చే పెన్షన్ విధానాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చెప్పారు. 

Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!  

Also Read: IPL 2023: ఐపీఎల్‌ 2023లో ఈ ఐదుగురి ఆటగాళ్లపై ఓ కన్నేయండి.. క్రీజ్‌లోకి దిగితే బౌలర్లకు వణుకే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News