BIrd flu: దేశంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలవరం రేపుతోంది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు ఇప్పటికే కేంద్రం నిర్దారించింది. మిగిలిన రాష్ట్రాల్లో కూాడా పరీక్షలు కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) ప్రకోపం నుంచి బయటపడకముందే బర్డ్ ఫ్లూ ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే దేశంలోని కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వెలుగుచూసింది. మిగిలిన రాష్ట్రాలకు విస్తరించిందా లేదా తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బర్డ్ ఫ్లూ వెలుగు చూసిందని కేంద్రం ప్రకటించింది.
బర్డ్ ఫ్లూ ( Bird flu ) నేపథ్యంలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్ లలో పరస్పర పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా నిలిపివేశారు. మహారాష్ట్రలోని ముంబైకు 5 వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్బనీ ప్రాంతంలో కేవలం రెండు రోజుల వ్యవధిలో 8 వందల కోళ్లు, పక్షులు మృతి చెందాయి. మురుంబా గ్రామంలోని కోళ్ల ఫారాలలో ఉన్న 8 వేల కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ( Central Government ) నివారణ చర్యలు చేపట్టింది. పార్లమెంటరీ వ్యవసాయ స్టాండింగ్ కమిటీ అధికారులు కేంద్ర పశు సంవర్ధక శాఖాధికార్లతో చర్చిస్తున్నారు. 2006లో తొలిసారి వెలుగుచూసిన బర్డ్ ఫ్లూ ..ఇప్పుడు మళ్లీ ప్రకోపిస్తోంది.
Also read: Bird flu: రాజధాని ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 శాంపిల్స్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook