Odisha: కరోనాతో బీజేడీ ఎమ్మెల్యే మహారథి కన్నుమూత

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది

Last Updated : Oct 4, 2020, 11:32 AM IST
Odisha: కరోనాతో బీజేడీ ఎమ్మెల్యే మహారథి కన్నుమూత

BJD MLA Pradeep Maharathy passes away: భువనేశ్వర్‌: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజగా ఒడిశా మాజీమంత్రి, బిజు జనతాదళ్‌ (BJD) సీనియర్‌ నాయకుడు, పిపిలి ఎమ్మెల్యే ప్రదీప్‌ మహారథి (65) (Pradeep Maharathy) కన్నుమూశారు. కరోనా బారినపడటంతో సెప్టెంబర్‌ 14న నుంచి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పటల్‌లో చేరారు. అయితే.. శుక్రవారం ఆయన పరిస్థితి విషమించడంతో అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్

పూరీ జిల్లాలోని పిపిలి నియోజకవర్గం నుంచి ప్రదీప్‌ మహారథి 1985 నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలుమార్లు మంత్రిగానూ పనిచేశారు. మొట్టమొదటి సారి 1985లో ఆయన జనతా పార్టీ నుంచి గెలిచారు. అయితే వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గాను మహారాథికి 2016 లో గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు, 2014-15 కృషి కర్మన్ అవార్డు లభించింది. ప్రదీప్‌ మహారథి మృతికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. Also read: Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి

Trending News