NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం

NPS- నేషనల్ పెన్షన్ స్కీమ్ ( National Pension Scheme ) ఖాతాదాలుకు కొత్త సదుపాయం లభిస్తోంది. వినియోగదారుల ప్రయోజనం కోసం ఫెన్షన్ ఫండ్ రెగ్యులేటర్  PFRDA నామినీని మార్చడానికి ఈ-సైన్ సదుపాయం కల్పించింది. 

Last Updated : Sep 16, 2020, 04:45 PM IST
    • NPS- నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాదాలుకు కొత్త సదుపాయం లభిస్తోంది.
    • వినియోగదారుల ప్రయోజనం కోసం ఫెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA నామినీని మార్చడానికి ఈ-సైన్ సదుపాయం కల్పించింది.
    • తమ స్కీమ్ లో నామినీని మార్చుకోవాలి అనుకునే వారు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. దీనికోసం ఒక ఫిజికల్ గా నామినేషన్ ఫామ్ నింపే అవసరం లేదు.
NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం

NPS- నేషనల్ పెన్షన్ స్కీమ్ ( National Pension Scheme ) ఖాతాదాలుకు కొత్త సదుపాయం లభిస్తోంది. వినియోగదారుల ప్రయోజనం కోసం ఫెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA నామినీని మార్చడానికి ఈ-సైన్ సదుపాయం కల్పించింది. తమ స్కీమ్ లో నామినీని మార్చుకోవాలి అనుకునే వారు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. దీనికోసం ఒక ఫిజికల్ గా నామినేషన్ ఫామ్ నింపే అవసరం లేదు.

Also ReadMoney Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు

ఫెన్షన్ ఫండ్  రెగ్యులేటర్ పీఎప్ ఆర్డీఏ ( PFRDA ) ఒక సర్య్కూలర్ జారీ చేసి నామినీని మార్చడానికి ఈ-సైన్ ఆధారిత ఆన్ లైన్ సేవలను ప్రారంభించింది. ఎన్ పిఎస్ అంటే పెన్షన్ తో పాటు పెట్టుబడి సౌకర్యం కలిగించే ఒక స్కీమ్. భారతీయుల విశ్రాంత జీవితం ప్రశాతంగా ఉండటానికి ఈ స్కీమ్ ను భారత ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థలో NPS వినియోగదారులు తమ ఎకౌంట్ వివరాలు ( PRAN ) లో మార్పులు కోరితే.. దానికి సంబంధించిన నోడల్ అధికారి, కార్పోరేట్ అధికారి దగ్గర  ఫిజికల్ S2 ఫామ్ దాఖలు చేసే అవసరం ఉండేది. 

Also ReadTelangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్

ఆన్ లైన్ లో NPS నామినీని ఎలా మార్చాలి అంటే ?

- నామినీని ఆన్ లైన్ లో  మార్చడానికి NPS వినియోగదారులు లాగిన్ వివరాలతో పాటు తమన CRA సిస్టమ్ వరకు చేరుకోవచ్చు.
 - దాని తరువాత డెమోగ్రాఫిక్ ఛేంజెస్ ( Damographic Changes ) మెనూలో ఉన్న అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ ( Update Personal Details ) ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- వినియోగదారులు ఇందులో నామినీ వివరాలను  Add/Update ఆప్షన్ ఎంచుకొని మార్చుకోవచ్చు.
- దీని తరువాత ఎన్ పిఎస్ వినియోగదారులు నామినీ పేరు, నామినీతో  రిలేషన్ , వంటి వివరాలు షేర్ చేయవచ్చు. 
- వివరాలు సేవ్ అండ్ కన్ ఫర్మ్  చేసిన తరువాత.. వినియోగదారుల మొబైల్ కు ఒక ఓటిపి (OTP ) వస్తుంది.
- ఈ వన్ టైమ్ పాస్ వర్డ్ ను సేవ్ సబ్మిట్ చేయండి.

Also ReadCricket Wonders: వీళ్ల బౌలింగ్ లో ఎవరూ సిక్సర్ కొట్టలేకపోయారు
- దీని తరువాత వినియోగదారులు ఈ-సైన్ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మార్పులను మీరు ఫైనలైజ్ చేసినట్టు అవుతుంది.
- వినియోగదారులు ఈ సిగ్నేచర్ ( E-Singature ) కోసం ఈ-సైన్ సదుపాయం కల్పించే సర్వీస్ ప్రొవైడర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సేవ లేదా ఇతర ఇంటర్నెట్ సెంటర్ లో ఇది పూర్తి చేసుకోవచ్చు.
- ఓటిపి మీ యూఐడిఏఐ (UIDAI ) రిజిస్టర్ మొబైల్ నెంబర్ పై పంపిస్తారు. 
- వినియోగదారులు ఓటిపి సబ్మిట్ చేసిన తరువాత నామినీ వివరాలు అప్డేట్ అయిపోతాయి.
- ఈ సైన్ విధానం విఫలం అయితే మీరు ఫిజికల్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News