'కరోనా వైరస్'.. దేశ రాజధాని ఢిల్లీని బెంబేలెత్తిస్తోంది. నిన్న కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వత్రా గుబులు పుట్టిస్తోంది. కొత్తగా నమోదైన కేసులు అన్నీ లక్షణాలు లేని కేసులు కావడం మరింత కల్లోలానికి కారణమవుతోంది.
ఢిల్లీలో తబ్లీగీ జమాత్ మత ప్రార్థనలు జరిగిన తర్వాత .. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీలో 1893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1643 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 207 మంది పాజిటివ్ రోగులు చికిత్స తీసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. కరోనా మహమ్మారికి 43 మంది బలయ్యారు. నిన్న కొత్తగా 186 కేసులు నమోదు కావడం గుబులు రేకెత్తిస్తోంది.
రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్‌పై ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సమీక్షించింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి పాక్షిక ఆంక్షలతో కొన్ని రంగాలకు ఊరటనివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రోజు రోజుకు కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఢిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అందుకే రేపటి నుంచి సడలింపు ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
#WATCH "We have decided to keep people of Delhi safe, the lockdown will remain, there will be no relaxation. Will review again after a week," Delhi CM Arvind Kejriwal pic.twitter.com/spQ8aEpmtE
— ANI (@ANI) April 19, 2020
ఢిల్లీని సురక్షితంగా ఉండాలన్నదే తమ ముఖ్య ఉద్దేశ్యమని కేజ్రీవాల్ తెలిపారు. అందుకే మరో వారం రోజులపాటు లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షిస్తామని తెలిపారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ పరిస్థితి చేయిదాటి పోలేదని .. అంతా నియంత్రణలోనే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలంటే .. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయడం ఒక్కటే మార్గమని అన్నారు.
తబ్లీగీ జమాత్ ఘటన తర్వాత ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 12 శాతం దేశ రాజధాని ఢిల్లీలోనే నమోదయ్యాయంటే .. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఢిల్లీలో లాక్ డౌన్‌కు సడలింపు ఇవ్వడం లేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల 27న మరోసారి పరిస్థితిని సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..