రైలు ప్రయాణానికి మార్గదర్శకాలు

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 50 రోజులుగా లూప్ లైన్లకే పరిమితమైన  రైళ్లు.. రేపటి నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లును రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. 

Last Updated : May 11, 2020, 05:08 PM IST
రైలు ప్రయాణానికి మార్గదర్శకాలు

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 50 రోజులుగా లూప్ లైన్లకే పరిమితమైన  రైళ్లు.. రేపటి నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లును రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. 

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 37 వేల రైళ్ల సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. గతంలో రెండుసార్లు రైల్వే సర్వీసులు పునః ప్రారంభమవుతాయనే ప్రచారం జరిగింది. కానీ అవన్నీ నకిలీ వార్తలేనని రైల్వే శాఖ కొట్టిపారేసింది. ఎట్టకేలకు మే 12 నుంచి రైళ్ల సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఐతే అది కూడా పాక్షికంగానే సేవలు అందిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పటికీ పూర్తిగా లొంగి రాలేదు. కాబట్టి.. పరిమిత ఆంక్షలతో రైల్వే సర్వీసులు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 

ఈ మేరకు రేపటి నుంచి దేశంలో 15నగరాలకు రైల్వే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణీకులు తప్పనిసరిగా కొన్ని మార్గదర్శకాలు పాటించాలని రైల్వే మంత్రిత్వ శాఖ  సూచించింది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

రేపటి నుంచి రైల్వేలలో ప్రయాణించే ప్రయాణీకులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ప్రయాణీకులకు గతంలో లాగా దుప్పట్లు, బ్లాంకెట్లు,  బెడ్ షీట్లు, టవల్స్, హ్యాండ్ కర్చీఫ్ లు అందించడం లేదని స్పష్టం చేసింది. కాబట్టి ఎవరికి సంబంధించిన బెడ్ షీట్లు, దుప్పట్లు వారే తీసుకుని రావాల్సి ఉంటుంది. అంతే కాదు రైల్వే బోగీలకు ఉన్న కర్టెయిన్లు కూడా తొలగించామని స్పష్టం చేసింది. 

మరోవైపు సోమవారం 4 గంటలకు టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రకటించిన సమయానికి టికెట్ బుకింగ్ ప్రారంభం కాలేదు. దీంతో మరికాసేపట్లోనే టికెట్ల రిజర్వేషన్లకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News