సీతారామన్ దయ: ఏడేళ్ల దండయాత్ర తర్వాత పెన్షన్ తీసుకోనుంది

2009 నుంచి కనిపించకుండా పోయిన రింకూ రాం అనే ఆర్మీ జవాన్ తల్లి ఎట్టకేలకు పెన్షన్‌కు అర్హురాలైంది.

Last Updated : Apr 10, 2018, 04:50 PM IST
సీతారామన్ దయ: ఏడేళ్ల దండయాత్ర తర్వాత పెన్షన్ తీసుకోనుంది

2009 నుంచి కనిపించకుండా పోయిన రింకూ రాం అనే ఆర్మీ జవాన్ తల్లి ఎట్టకేలకు పెన్షన్‌కు అర్హురాలైంది. ఏడేళ్ల పాటు పెన్షన్ కోసం తీవ్రంగా పోరాడిన ఆమె.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాయంతో కొడుకు పెన్షన్ తీసుకోనుంది. పెట్రోలింగ్ చేస్తూ ఆ జవాన్ అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దు (ఎల్వోసీ) వద్ద ఓ నదిలో 2000లో పడిపోగా అతడి శరీరం ఇంతవరకు కూడా లభించలేదు. పెన్షన్ కోసం సాయుధ దళాల ట్రిబ్యునల్‌ను ఆమె ఆశ్రయించగా.. బాడీ దొరికాకే ఇస్తామని ఇన్నేళ్లు ఆ తల్లిని తిప్పారు.

రక్షణ మంత్రి తక్షణమే కేసును పరిశీలించి ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని ఆర్మీ అధికారులను ఆదేశించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

రక్షణ మంత్రి ఆదేశాలతో.. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 4న రింకూ రాం మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది. ఆ తరువాత రింకూ రాం తల్లికి ఏప్రిల్ 5వ తేదీన అలహాబాద్ పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులను (పిపిఓ) కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (పెన్షన్స్) ద్వారా జారీచేసింది. పిపిఓ ప్రకారం, నవంబర్ 19, 2009 నుంచి డిసెంబరు 31, 2015 వరకు నెలకు 7,000 రూపాయలు, ఆ తరువాత నెలకు రూ. 17,990, మంజూరు చేశారు. అదనంగా, గ్రాస్ డెత్-కమ్-రిటైర్మెంట్ గ్రాట్యుటీ (డీసీఆర్జీ) రూ.86,106, ఎక్స్‌గ్రేషియా మొత్తం 10 లక్షల రూపాయలను హక్కుదారులకు మంజూరుచేశారు.

Trending News