జార్ఖండ్‌లో మరో నిర్భయ ఘటన.. గ్యాంగ్ రేప్‌కు ప్రోత్సహించింది బాధితురాలి భర్తే..!

జార్ఖండ్‌లో మరో నిర్భయ ఘటన జంతారా ప్రాంత వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 

Last Updated : Nov 9, 2018, 11:01 AM IST
జార్ఖండ్‌లో మరో నిర్భయ ఘటన.. గ్యాంగ్ రేప్‌కు ప్రోత్సహించింది బాధితురాలి భర్తే..!

జార్ఖండ్‌లో మరో నిర్భయ ఘటన జంతారా ప్రాంత వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నారాయణపూర్, జంతారా సమీప ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇటీవలే తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. తర్వాత ఊరు విడిచి వెళ్లిపోయింది. అయితే ఆ సమయం నుండి భార్యపై కక్ష పెంచుకున్న భర్త.. ఆమెను గత కొద్ది రోజులుగా గమనించడం ప్రారంభించాడు. బుధవారం నాడు కాళీపూజ సందర్భంగా ఊరిలో జరుగుతున్న జాతర చూడడానికి తను రాగా.. ఆమెను తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు.

తర్వాత ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లి... తన మిత్రులతో కలిసి అత్యాచారం చేశాడు. తర్వాత బాధితురాలి మర్మాయవాల్లో కర్రలు దూర్చి.. ఆమెను హత్య చేయడానికి కూడా నిందితులు  ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పూర్తిగా రక్తపు మడుగులో ఉన్న యువతి శరీరం మర్నాడు పొలాల వద్ద గ్రామస్తులకు కనిపించడంతో వారు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఈ దారుణానికి పాల్పడింది తన భర్త స్నేహితులు అని వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

కాకపోతే.. పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి ముందే అత్యాచారానికి గురైన యువతి ఆసుపత్రిలో మరణించింది. ఈ కేసు గురించి నారాయణపూర్ సబ్ డివిజినల్ ఆఫీసర్ బీఎన్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలి భర్తను, ఆయన స్నేహితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే వారిలో ఇప్పటికే ఇద్దరు పరారయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేరానికి సంబంధించి అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నామని.. పూర్తిస్థాయి ఎంక్వయరీ తర్వాత మిగతా విషయాలను మీడియాకు తెలుపుతామని పోలీసులు అన్నారు.

Trending News