NIA Raids: ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ(NIA) తన వేటను కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, భైంసాలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
ఇందులోభాగంగానే సోదాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈకేసులో నిందితులు, అనుమానితులుగా ఉన్న వారి ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. నిజామాబాద్‌లో మొత్తం 20 చోట్ల నాలుగు ఎన్ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాలను కొనసాగిస్తున్నారు. స్థానిక మదీనా కాలనీలో పలు ఇళ్లల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో సోదాల అనంతరం భైంసాకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జగిత్యాలలో మూడు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టవర్ సర్కిల్లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్లో ఓ ఇంటిలో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈసందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీలోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని ఖాజానగర్‌లో విస్తృతంగా సోదాలు చేశారు.
ఇలియాజ్‌తోపాటు స్నేహితుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉగ్రమూలాలున్నాయన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కీలక విషయాలను రాబట్టుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది. దేశంలో ఏ ఘటన జరిగినా..మూలాలు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Also read:Prabhas: హీరో ప్రభాస్ సోదరుడు పొలిటికల్ ఎంట్రీ! అక్కడి నుంచే పోటీ?
Also read:Punjab: చండీగఢ్ యూనివర్శిటీలో దారుణం..60 మంది విద్యార్థినుల బాత్ రూం వీడియోలు లీక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి