దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గల ఒక ఇంట్లో 11 మంది మృతదేశాలు వెలుగుచూడటం కలకలం రేపింది. ఇందులో ఏడుగురు మహిళల మృతదేహాలు, నలుగురు పురుషుల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును మొదలుపెట్టారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా కనుగొన్నారు. మృతదేహాల కళ్లకు గంతలతో పాటు నోటికి అడ్డుగా గుడ్డ కట్టి ఉన్నాయి. వీరిలో పది మృతదేహాలు రెయిలింగ్‌కు వేలాడుతూ కనిపించగా, మరో మృతదేహం నేలపై పడి ఉంది. ఈ కుటుంబానికి సొంతంగా పచారీ దుకాణం ఉంది.
#LatestVisuals from Delhi's Burari where bodies of 7 women and 4 men have been found at a house; Police present at the spot, investigation on. pic.twitter.com/2MukQxi8az
— ANI (@ANI) July 1, 2018
Bodies of 11 members of a family found in a house in Delhi's Burari: 10 bodies were found blindfolded and hanging from a railing in the house and one body was found lying on the floor. The family owned a grocery shop- Sources pic.twitter.com/f9uIAalgRN
— ANI (@ANI) July 1, 2018
డబ్బు కోసం హత్య చేశారంటూ కొందరు.. ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలిలో ఎలాంటి సూసైట్ నోట్ ఇంతవరకూ దొరకలేదు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చనిపోయిన వీరందరూ ఎవరు? ఇందుకు గల కారణాలు సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ముగ్గురు యువకులతో సహా ఏడుగురు మహిళల మృతదేహాలు, నలుగురు పురుషుల మృతదేహాలను గుర్తించారు. మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏఎన్ఐకి తెలిపారు.