NEET UG 2024 ROW: NEET UG 2024 వివాదానికి సుప్రీంకోర్టు తెర దించింది. 24 మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందనే ఉద్దేశ్యంతో రీ నీట్ కు నో చెప్పింది. 155 మంది విద్యార్ధుల వల్ల 24 లక్షల మంది ప్రభావితం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అదే సమయంలో మరో వివాదానికి పరిష్కారం చూపింది. ఫలితంగా నీట్ ర్యాంకులు రివైజ్ కానున్నాయి.
ఈ ఏడాది నీట్ పరీక్షలో ఎన్నడూ లేనంతగా గందరగోళం, అవకతవకలు నెలకున్నాయి. నీట్ యూజీ 2024 పేపర్ కూడా లీకైంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లపై కూలంకషంగా విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 మంది సభ్యుల ధర్మాసనం రీ నీట్ పరీక్ష కుదరదని చెప్పింది. పేపర్ లీక్ నిజమేనని కానీ దీనివల్ల కేవలం 155 మంది విద్యార్ధులే లబ్ది పొందారని రుజువైందని కోర్టు వెల్లడించింది. అందుకే నీట్ యూజీ 2024 పరీక్ష మరోసారి నిర్వహించేందుకు అవకాశం లేదని తేల్చింది.
అదే సమయంలో మరో వివాదానికి పరిష్కారం సూచించింది. నీట్ ప్రశ్నాపత్రంలోని ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు రెండు సమాధానాలుండగా అందులో ఏ ఒక్కటి ఎంపిక చేసినా మార్కులు కేటాయించారు. ఇలా చేయడం వల్ల మెరిట్ లిస్టుపై ప్రభావం పడుతుందంటూ ఓ అభ్యర్ధి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అభ్యర్ధి వాదనల్ని పరిగణలో తీసుకున్న జస్టిస్ చంద్రచూడ్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి సూచనలివ్వాలని కోరింది. ఒకే ప్రశ్నకు రెండు మార్కులు ఇవ్వడం కుదరదని ఆప్షన్ 4 ఎంచుకున్నవారికే మార్కులు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఎన్టీఏ నీట్ ర్యాంకుల్ని రివైజ్ చేయాల్సి వస్తుంది.
నీట్ యూజీ 2024 పరీక్ష రాసిన 24 లక్షల మందిలో 4.2 లక్షల మంది 4 మార్కులు కోల్పోనున్నారు. ఈసారి 720కు 720 మార్కులు పొందిన వారిలో ఇలా 4 మార్కులు కోల్పోతున్నవారు ఏకంగా 44 మంది ఉన్నారు. అంటే 44 మందికి టాప్ ర్యాంకు పోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook