NEET 2021 Results: నీట్-యూజీ 2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు గురువారం లైన్ క్లియర్ చేయడంతో ఎన్‌టీఏ(NTA) సోమవారం సాయంత్రం నీట్ ఫలితాలు ప్రకటించింది.
విజయవాడ విద్యార్థికి ఐదో ర్యాంకు
సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని విద్యార్థులు ఎదురుచూశారు. నాలుగు రోజులైనా ఫలితాలు వెల్లడించకపోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏ(NTA) అధికారులు ఈరోజు ఫలితాలను విద్యార్థుల ఈ-మెయిల్స్‌కు పంపిస్తున్నారు. విజయవాడ విద్యార్థి రుషీల్ నీట్‌లో ఐదో ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Also read: Diwali gift: పంజాబ్ ప్రజలకు గుడ్ న్యూస్..విద్యుత్ ఛార్జీ యూనిట్‌కు రూ.3 తగ్గింపు!
మెడికల్, డెంటల్, ఆయుష్ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష(NEET Exam) నిర్వహించినప్పటికీ ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ రావడంతో విద్యార్థుల్లో(Students) ఆందోళన వ్యక్తమైంది. ముంబయిలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అంత వరకు ఫలితాల విడుదల నిలిపివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ వచ్చింది.
అయితే, బాంబే హైకోర్టు(Bombay highCourt) తీర్పుపై ఎన్‌టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. కేవలం ఇద్దరి కోసం 16లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. ఆ ఇద్దరి విద్యార్థుల విషయాన్ని దీపావళి సెలవుల(Diwali holidays) అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook